Learn • Prepare • Succeed
AP కరెంట్ అఫైర్స్ MCQS

ఏపీ కరెంట్ అఫైర్స్ తెలుగు: కీలకమైన ప్రశ్నలు & సమాధానాలు (13–20 అక్టోబర్)

📅 October 15, 2026  |  Devendra Jaladurgam
ఏపీ కరెంట్ అఫైర్స్ తెలుగు

ముఖ్యగమనిక : ఏపీ కరెంట్ అఫైర్స్ తెలుగు, APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్, SI మరియు మిగతా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఉపయోగపడేలా ఈ కరెంటు అఫైర్స్ ప్రశ్నలు–సమాధానాలు వాటి వివరణలు మీకు చాదవడానికి వీలుకలిగేలా రూపొందించబడ్డాయి.కావున మీరందరు మంచిగా చదివుకోని ఉన్నతస్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నాము .

ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026

Q1 నేషనల్ సారస్ మేళా 2026లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన రాష్ట్రపతి ఎవరు?

సమాదానం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
వివరణ: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడికి ఈనెల అక్టోబర్ 14వ తేదీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సందర్శించారు.14వ తేదీ ఆలయంలో ప్రార్థనలు చేసి, అక్టోబర్ 15న పున్నమి ఘాట్‌లో నేషనల్ సారస్ మేళా ప్రారంభించారు. నేషనల్ సారస్ మేళా ను అనుసంధానించి మహిళలకు వ్యాపారపరంగా ప్రోత్సహించడంతో,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అభినందించారు.

Q2 జాతీయ సారస్ మేళా ద్వారా గ్రామీణ మహిళలకు కల్పించాలనుకున్న ప్రధాన ప్రయోజనం ఏమిటి?

సమాదానం: మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం
వివరణ: చిన్న చిన్న గ్రామల్లో నివసించే మహిళలకు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్లో అవకాశాలు కల్పించడం, అమ్మకాలు పెంచి ఆదాయం మెరుగుపరచడం , ముక్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచడం నేషనల్ సారస్ మేళా ప్రధాన ముఖ్య ఉద్దేశం.

Q3 నేషనల్ సారస్ మేళా నిర్వహణకు బాధ్యత వహించిన కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఏవి?

సమాదానం: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ,ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ.
వివరణ: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ SERP (Society for Elimination of Rural Poverty) ఈ రెండు సంస్థలు బాధ్యతను వహించి జాతీయ సారస్ మేళాను నిర్వహించాయి.

Q4 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ పెట్టుబడి తీసుకొచ్చిన ఆలోచనల ద్వారా ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడి ఆశిస్తున్నారు?

సమాదానం: సుమారు ₹79,628.04కోట్ల పెట్టుబడి అలాగే వీటి ద్వారా 1,88,038 ఉద్యోగ అవకాశాలు.
వివరణ: 2026 అక్టోబర్ 14న వచ్చిన పరిశీలన నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడు ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుల కోసం 115 అవగాహన ఒప్పందాలను (MoUs), ₹79,628.04 కోట్ల భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి సంబధించి యువతకు సుమారు 1,88,038 ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అంచనా వేశారు.ఇది కేవలం అంచనా మాత్రమే.

Q5 అక్టోబర్ 7, 2026 అక్టోబర్‌ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమావేశంలో ప్రభుత్వం ఎన్ని MoUలకు నిర్ణయం తీసుకుంది?

సమాదానం: 31(MoU)లకు నిర్ణయం తీసుకుంది.
వివరణ: 2026 అక్టోబర్ 7న విశాఖపట్నంలో జరిగిన CII ప్రాంతీయ పెట్టుబడుల సమావేశంలో 31 (MoU)లకు నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు ₹21,489 కోట్ల పైగా పెట్టుబడులు వస్తాయి. ఈ పెట్టుబడి ద్వారా 56,945 ఉద్యోగ అవకాశాలు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు స్పష్టం చేసాయి.

Q6 అక్టోబర్ 12న కాకినాడలో పెట్టుబడిదారులతో కుదిరిన అవగాహన ఒప్పందాలు ఎన్ని

సమాదానం: 15 అవగాహన ఒప్పందాలు.
వివరణ: ఈ అవగాహన ఒప్పందాల విలువ సుమారు ₹21,489 కోట్లు, వాటి ద్వారా యువతకు వచ్చే ఉద్యోగ అవకాశాలు సుమారుగా 56,945.ఈ పెట్టుబడి ద్వారా ఎక్కువగా యువత లబ్ధిపొందుతుంది.

Q7 రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రాంతీయ పెట్టుబడుల సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నారు?

సమాదానం: పరిశ్రమలను ఆకట్టుకోవడం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం,యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడం.
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకట్టుకోవడం ద్వారా ,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త పరిశ్రమలను స్థాపించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, చదువు పూర్తి అయిన యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడం,ఇవన్నీ పెట్టుబడుల సమావేశాల ప్రధాన ముఖ్య లక్షణాలు.

Q8 క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం పేరేమిటి?

సమాదానం: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2026.
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ అనుకూల ఇంధన విభాగాన్నీ అభివృద్ధి చేయడానికి సమీకృత స్వచ్ఛ ఇంధన విధానం (Integrated Clean Energy Policy) సృష్టించడం జరిగింది.ఈ పాలసీ విధానం ద్వారా సౌరశక్తి, పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తి పెంచడం ప్రధాన లక్ష్యం.ఇంధనం పైన ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఈ విధానం సహాయపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026

ఏపీ కరెంట్ అఫైర్స్ తెలుగు

Q9 ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి 2026లో ప్రకటించిన పరీక్ష ఏది?

సమాదానం: మెగా DSC 2026.
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు కోసం AP DSC–2026 (APTRT–2026)నోటిఫికేషన్‌ను ఈ నెల అక్టోబర్ 13 2026న విడుదల చేసింది. ఈ ప్రకటనలో మొత్తంగ 2,721 తాత్కాలిక పోస్టులను ప్రకటించారు. మెగా DSE పోస్టుల వివలకు చూస్తే, స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT), ప్రిన్సిపాళ్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు నోటిఫికేషన్లో రిలీజ్ చేసారు.

Q10 అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఆవిష్కరణ కేంద్రం పేరు ఏమిటి?

సమాదానం: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.(Ratan Tata Innovation Hub – RTIH)
వివరణ: ఈ కేంద్రం ద్వారా మార్కెట్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు సహాయం అందిస్తారు.సొంత ఆలోచనలతో వ్యాపారం చేయాలనుకునేవారికి అవసరమైన విషయాలు ప్రోత్సహిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కేద్రంకు సంబంధించిన శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు .

Q11 ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ రంగానికి సంబంధించి అక్టోబర్ 19న ఏ అంశం వార్తల్లో నిలిచింది?

సమాదానం: ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 2024–29, అమరావతిలో డ్రోన్ సిటీ ప్రతిపాదన గురించి.
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ రంగానికి సంబంధించి డ్రోన్ల తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, డ్రోన్లపై కొత్త పరిశోధనలు చేయడానికి, వాటిని వ్యవసాయానికి ఉపయోగపడేల దృష్టిసాధించింది. భద్రత వంటి రంగాల్లో దీనిని ఉపయోగించడానికి ప్రోత్సాహం ఇవ్వడం దీని ముఖ్య లక్ష్యం. అయితే, ఈ విషయాలకు ప్రభుత్వం మొదటి ఆమోదం ఇచ్చిందా ఇవ్వలేదా అనేది అధికారిక క్యాబినెట్ ప్రకటన ద్వారా సమాచారంకోసం ఎదురుచూడాలి.

Q12 2026లో ఆంధ్రప్రదేశ్‌లో జీవవైవిధ్యానికి సంబంధించిన ఏ ముందస్తు ఆలోచన వార్తల్లో నిలిచింది?

సమాదానం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక 2026–2035.
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళిక 2026–2035 (Andhra Pradesh State Biodiversity Strategy and Action Plan – AP-SBSAP). ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం ఏంటంటే, రాష్ట్రంలోని చిన్న అడవుల నుంచి పెద్ద అడవులవరకు రక్షించడం, సహజ సిద్ధమైన సరస్సులను కాపాడటం,చెట్లు ,మొక్కలు అలాగే జంతువులు మరియు ఇతర సహజ వనరులను రక్షించడం.దీని వళ్ళ ప్రకృతి కాపాడినవాళ్ళం అవుతాం.

Q13 ఏ జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు?

సమాదానం: కర్నూలు జిల్లా.
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్ల ఓర్వకల్లు అనే గ్రామంలో పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చేయాలని ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో ఉన్నవి అలాగే కొత్తవి పరిశ్రమలు సులభంగా పనిచేయడం కోసం రహదారులు, విద్యుత్, సంబంధిత సరుకు రవాణా వంటి అవసరమైన సదుపాయాలు మెరుగుపరుచుకోవచ్చుని వివరించారు. ఈ అభివృద్ధి వల్ల కొత్త పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు పెరగడానికి, యువతకు ఉద్యోగాలు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రణాళికకు ఇంకా డబ్బు నిర్ణయించలేదు.

Q14 ప్రకృతి నుంచి మళ్లీ లభించే ఇంధన వనరులు ఏవి?

సమాదానం: సౌరశక్తి (సూర్యరశ్మి), పవనశక్తి (గాలి), జలవిద్యుత్, బయోమాస్ ఇంధనం, భూఉష్ణశక్తి.
వివరణ: సూర్యుడి నుంచి భయంకరమైన వేడి శక్తి సౌరశక్తి,గాలి నుండి వచ్చే శక్తి పవనశక్తి, నీటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తి జలవిద్యుత్, మొక్కలు, చెట్ల కొమ్మలు, వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ వంటి వాటి నుంచి తయారు చేసే శక్తిని బయోమాస్ ఇంధనం అంటారు. ఈ శక్తి వనరులను ఉపయోగించడం వల్ల బొగ్గు, పెట్రోలు వంటి ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. ముక్యంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి చాల బాగా సహాయపడతాయి.

Q15 రెండు సంస్థల మధ్య కుదిరే అవగాహన ఒప్పందం అంటే ఏమిటి?

సమాదానం: రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలునుండి అంగీకారాలను తెలిపే పత్రం.
వివరణ: MoU పూర్తి పేరు Memorandum of Understanding. దీనిని అవగాహన ఒప్పందం అని అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలు కలిసి పనిచేయడం కోసం MoUని వాడతారు. ఇరువర్గాలనుంచి అంగీకరించిన విషయాలు, బాధ్యతలు, ఉద్దేశాలను ఇందులో నమోదు చేస్తారు.

1 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *