Learn • Prepare • Succeed
AP కరెంట్ అఫైర్స్ MCQS

ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026: కీలకమైన ప్రశ్నలు & సమాధానాలు (11–12 అక్టోబర్)

📅 October 15, 2026  |  Devendra Jaladurgam
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026

ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026

Q1 ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పథకం ఏది?

సమాదానం: అడవి తల్లి బాట 2.0.
వివరణ: 2026 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల చిన్న చిన్న గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడానికి [అడవి తల్లి బాట 2.0 ] అనే కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లాలోని కాకవాడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఇందులో [1,976] కిలోమీటర్ల రహదారులు ద్వారా [1,341] గిరిజన ఆవాసాలను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంచనా చూసినట్లయితే వ్యయం [₹2,052] కోట్లు.ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రజలకు రవాణా,విద్య,వైద్యం,మార్కెట్లకు చేరుకునే సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

Q2 ఎండలు, నీటి కొరత కారణంగా దెబ్బతింటున్న పండ్ల తోటలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఏది?

సమాదానం: లైఫ్-సేవింగ్ ఇరిగేషన్ (LSI) పథకం
వివరణ: ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ [ లైఫ్-సేవింగ్ ఇరిగేషన్ (LSI)] పథకం రాబోయే ఎల్‌నినో ప్రభావం ఉద్యాన పంటలమీద పడుతుంది.తీవ్రమైన వేడి నుంచి రక్షించడానికి ఈ పథకం అమలులోకి వచ్చింది.ఈ పథకం ముక్యంగా బోరుబావులు పూర్తిగా ఎండిపోయి, ఎండిపోయే ప్రమాదంలో ఉన్న పండ్ల తోటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.ఒక్కో 5,000 లీటర్ల ట్యాంకర్‌కు ₹780 ఖర్చు అవుతుంది.కానీ ఇందులో 80% వరకు ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది.తీపి నిమ్మకాయ తోట,మామిడి తోట వంటి పంటలకు సబ్సిడీ మారుతుంది.ఈ పథకానికి అర్హులైన రైతులు రైతు భరోసా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Q3 దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనే సారస్ మేళా ఎక్కడ జరిగింది?

సమాదానం: విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద.
వివరణ: నేషనల్ సారస్ మేళా 2026ను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విజయవాడ పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు నిర్వహించేందుకు నిర్దేశించారు.మన భారతదేశంలో ఉన్న 30కి పైగా రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల నుంచి 1,500 మందికి పైగా మహిళా వ్యాపారులు పాల్గొనేలా ప్రణాళిక నిశ్చయించారు.ఈ నేషనల్ సారస్ మేళాలో మహిళలు తయారుచేసిన హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు వంటి వస్తువులను ఈ మేళాలో ప్రదర్శిస్తారు.దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి, ఆదాయం, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.

అక్టోబర్ 11–12 ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు–సమాధానాలు కాపీ చేయండి

Q4 3. నేషనల్ సారస్ మేళా ఏ వర్గం వారి ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది?

సమాదానం: మహిళలకు అమ్మకాలు, ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంచడం నేషనల్ సారస్ మేళా ప్రధాన ఉద్దేశం.
వివరణ: కొత్త హస్తకళలు,ముఖ్యమైన చేనేత మగ్గం వస్త్రాలు,సంప్రదాయ వస్తున్న ఆహార ఉత్పత్తులను విక్రయించడానికి ఈ మేళా వేదికగా బలపడుతుంది.

Q5 తిరుమలలోని దర్శనం ప్రవేశ ద్వారాలు, తాగునీటి కేంద్రాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి ఉపయోగపడే యాప్ ఏది?

సమాదానం: వెంకటాద్రి యాప్.
వివరణ: తిరుమలలో భక్తులకు దారి తెలవకపోయిన,తిరుమలలో సౌకర్యాలు గురించి తెలియకపోయిన,సేవల సమాచారాన్ని తెలుసుకోవాలన్న ఈ అప్ ఉపోయోగపడుతుంది [వెంకటాద్రి యాప్].ఈ యాప్‌ను TTD అభివృద్ధి.

Q6 గోదావరి ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కోసం కుదిరిన పెట్టుబడి ఒప్పందాల మొత్తం విలువ ఎంత?

సమాదానం: ₹6,200 కోట్లు.
వివరణ: 2026 అక్టోబర్ 12న కాకినాడలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో గోదావరి ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి కోసం పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు కొత్త పరిశ్రమలు ఏర్పాటు కొరకు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు సంబంధించినవి.ఈ పెట్టుబడుల ద్వారా కొత్త పరిశ్రమలు వచ్చిన తరువాత స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

Telugu current affairs

గమనిక: ఈ పోస్ట్‌లోని సమాచారం అందుబాటులో ఉన్న వార్తా నివేదికలు, అధికారిక ప్రకటనల ఆధారంగా అందించబడింది. పరీక్షల కోసం చదివే ముందు ముఖ్యమైన తేదీలు, గణాంకాలు, పథకాల వివరాలను సంబంధిత అధికారిక వనరులతో ధృవీకరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *