Learn • Prepare • Succeed
National Current Affairs

FNTA బిల్లు 2026: తూర్పు నాగాలాండ్ అభివృద్ధికి కీలక ముందడుగు

📅 October 28, 2026  |  Devendra Jaladurgam
FNTA బిల్లు 2026

ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ బిల్లు,2026 అక్టోబర్‌ నెలలో జాతీయ కరెంట్ అఫైర్స్‌ సంబంధించి ఒక ముఖ్యమైన అంశం, ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (FNTA) బిల్లు, 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు ఈ బిల్లును అంగీకరిశారు. ఈ చట్టం ద్వారా తూర్పు నాగాలాండ్‌లో ఆరు జిల్లాలకు స్థానిక సంస్థల పాలనకు దారులు తెరుచుకున్నాయి.

ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ బిల్లు

(ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ).FNTA అంటే ఏమిటి?

ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (FNTA , సులభమైన పద్దతిలో చెప్పాలంటే,ఆరు జిల్లాలు కలిపి అభివృద్ధి, పరిపాలన అధికారికరంగా చేసే పేరే తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల అభివృద్ధి.కాబట్టి మనం పరిపాలనకు సంబంధించి ప్రత్యేక హక్కులు గల ప్రాంతం అని చెప్పవచ్చు.

FNTA పరిధిలోకి వచ్చే ఆరు జిల్లాల పేర్లు

1.Tuensang (టుయెన్‌సాంగ్)

2.Mon (మోన్)

3.Longleng (లాంగ్‌లెంగ్)

4.Kiphire (కిఫిరే)

5.Noklak (నోక్లాక్)

6 .Shamator (షమటోర్)

ఈ అథారిటీ ఎందుకు ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది?

తూర్పు నాగాలాండ్‌లో నివసిస్తున్న ప్రజలు తమ ప్రాంతానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి, మెరుగైన అభివృద్ధి అవకాశాలు కల్పించాలని చాలా కాలంగా కోరుతున్నారు.ఈ FNTA ఏర్పాటు కూడా అదే కారణం.

ప్రజలు డిమాండ్ చేసే ప్రధాన అంశాలు

1 .ప్రాంతీయ రహదారులు, విద్య వైద్య సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాలు.
2 .ప్రాంతానికి ముఖ్యమైన అభివృద్ధి అంశాలలో స్థానిక స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం.
3.ప్రజల కోసం మంచి నిర్ణయాలు సామాజిక, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, భాషా అవసరాలను తీర్చడం

FNTAకి మారుస్తున్న 46 అంశాలు

46 అంశాల అధికారాలు బదిలీ చేశారంటే రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు పోయాయని కాదు.ఒక ప్రాంతంలో పాఠశాలలు కానీ, గ్రామీణ రహదారులు కానీ, వ్యవసాయం అభివృద్ధి పనులు చేయాలి అనుకోండి . ఆ పనులకు సంబంధించిన బదిలీ చేసిన అధికారాల పరిధిలో FNTA స్థానిక అవసరాలకు సంబంధిత ప్రణాళికలు తయారుచేసి దాన్ని అమలు చేయగలదు.

FNTA బిల్లు 2026

క్రమ సంఖ్య రంగం సులభమైన ఉదాహరణ
1 వ్యవసాయం రైతులకు సంబంధించిన అభివృద్ధి పనులు
2 విద్య హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్య
3 ఆరోగ్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య సేవలు
4 రహదారులు జిల్లా రహదారులు, వంతెనలు
5 నీటిపారుదల పంటలకు నీరు అందించే కాలువలు
6 అటవీ సంరక్షణ రిజర్వ్ అడవులు కాని అడవుల నిర్వహణ
7 మత్స్య సంపద చేపల పెంపకం, మత్స్య వనరులు
8 పర్యాటకం తూర్పు నాగాలాండ్‌కు ప్రత్యేకమైన పర్యాటక ప్రాజెక్టులు
9 ఉపాధి ITIలు, నైపుణ్య శిక్షణ
10 గ్రామీణాభివృద్ధి గ్రామాల్లో అభివృద్ధి పనులు
11 పశుసంవర్ధక శాఖ పశువుల పెంపకం, పశువైద్య సేవలు
12 స్థానిక పన్నులు స్థానిక పన్నులు, ఫీజులు, టోల్ వసూళ్లు
13 గృహ నిర్మాణం గ్రామీణ, పట్టణ గృహ పథకాలు
14 క్రీడలు యువత, క్రీడల అభివృద్ధి
15 చేతివృత్తులు చేనేత, హస్తకళల ప్రోత్సాహం

FNTAలో మొత్తం 62 మంది సభ్యులు :

1.ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ,మొత్తం 40 ఇందులో మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది.
2.పదవీ హోదా ద్వారా సభ్యత్వం పొందిన శాసనసభ్యులు మొత్తం 20 మంది.
3.గవర్నర్ నామినేట్ చేసే సభ్యులు మొత్తం 2 .

APPSC పరీక్షల కోసం కరెంట్ అఫైర్స్ 2026

Q1 FNTA పూర్తి పేరు ఏమని పిలుస్తారు?

సమాదానం: Frontier Nagaland Territorial Authority.

Q2 FNTA బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ తేదీన ఆమోదం తెలిపారు?

సమాదానం: 25 అక్టోబర్ 2026

Q3 FNTA పరిధిలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?

సమాదానం: 6

Q4 ఎన్ని అంశాలకు సంబంధించి FNTAకి అధికారాలు కల్పించనున్నారు?

సమాదానం: 46

Q5 FNTAలో ఎంతమంది ప్రతినిధులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు?

సమాదానం: 62

Q6 FNTA ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందా?

సమాదానం: లేదు, ఇది నాగాలాండ్ రాష్ట్ర పరిధిలోనే పనిచేసే ప్రాంతీయ స్వయంపాలన సంస్థ.

ఏపీ కరెంట్ అఫైర్స్ తెలుగు: కీలకమైన ప్రశ్నలు & సమాధానాలు (13–20 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *