జాతీయ కరెంట్ అఫైర్స్ 2026: కీలకమైన ప్రశ్నలు & సమాధానాలు (1–20 అక్టోబర్ 2026)
ముఖ్యమైన నోట్స్ : జాతీయ కరెంట్ అఫైర్స్ 2026, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్. ఈ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు మరియు వాటి వివరణలు మీకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడ్డాయి. మీరందరూ బాగా చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని మేము కోరుకుంటున్నాము.
నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026
Q1 భారతదేశంలో సివిల్ సర్వీసెస్ నియామక పరీక్షలు నిర్వహించే సంస్థ అక్టోబర్ 1, 2026 కళ్ళ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
సమాదానం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).
వివరణ:
UPSC 1926 అక్టోబర్ 1న ప్రారంభించారు.2026 అక్టోబర్ 1న నాడు 100 సంవత్సరాలకు నిలిచింది. దీని సందర్బంగ న్యూఢిల్లీలో ఉన్న భారత్ మండపంలో వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఎల్లప్పుడు గుర్తుండిపోయెల ప్రత్యేక నాణెం ,పోస్టల్ స్టాంపు అంటే (తపాలా బిళ్ల)
Q2 గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి?
సమాదానం:
పునరుత్పాదక విద్యుత్ ప్రసారం
వివరణ:
ఈ ప్రణాళిక ద్వారా అత్యంత శక్తికరమైన సూర్యుని విద్యుత్ అలాగే గాలి నుంచి తయారయ్యే విద్యుత్‌ను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకి సులభంగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తారు.
Q3 చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన SME Growth Fund విలువ ఎంత?
సమాదానం:
₹10,000 కోట్లు.
వివరణ:
ఈ SME Growth Fund ద్వారా మధ్య తరహా వ్యాపారాలకు డబ్బు సహాయం చేయడం జరుగుతుంది. ఆ సహాయంతో చిన్న వ్యాపారులు నుంచి పెద్ద వ్యాపారాలుగా అభివృద్ధి చేసుకుని, భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా ఎదగడం ఈ SME ముఖ్య ఉద్దేశం.
Q4 Integrated Transport & Logistics Authority ఏర్పాటు చేయడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి?
సమాదానం:
వివిధ రవాణా మార్గాలను, సరుకులను ఒక చోటు నుంచి మరో చోటుకు పంపించే సులభంగా పంపించేలా చూడటం.
వివరణ:
రైలు రవాణా, జలరవాణా మరిన్ని వ్యవస్థలు ఉపయోగించుకోని మెరుగుపరచడం ద్వారా సరుకు రవాణా మరింత పెంచేందుకు ఈ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ తెలిపింది.
Q5 నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను ఎన్ని సంవత్సరాలు కొనసాగించనున్నారు?
సమాదానం:
ఐదు సంవత్సరాలు 2026-27 నుంచి 2030-31 వరకు.
వివరణ:
నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వృద్ధులకు, భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు , దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.ఇది ముక్యంగా వారికి అవసరమైన ఖర్చులకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది.
Q6 IDBI బ్యాంక్‌లో తన వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్య ఏమిటి?
సమాదానం:
IDBI బ్యాంక్‌లో 60.72% వాటాను విక్రయించే ప్రక్రియ ముందుకు సాగింది.
వివరణ:
కెనడాకు చెందిన Fairfax Financial సంస్థ, IDBI బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేయడానికి సుమారుగ ₹52,878 కోట్లు విలువైన ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఇంకా ఒప్పందం పూర్తి అయిందా లేదా అనేది ఇంకా తెలియాలి.
Q7 భారతదేశం, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) ఏ తేదీన అమలులోకి వచ్చింది?
సమాదానం:
అక్టోబర్ 20, 2026.
వివరణ:
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA ఒప్పందం వల్ల మొట్టమొదట కలిగే ప్రయోజనం ఏంటంటే భారతదేశంలో తయారయ్యే వస్తువులను న్యూజిలాండ్‌లో ఎక్కువగా అమ్మే అవకాశం పెరుగుతుంది. దీని ప్రకారంగా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య వ్యాపారం పెరగడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.
Q8 INS Samarthak ఏ సైనిక సంస్థకు చెందిన నౌక?
సమాదానం:
భారత నౌకాదళం.
వివరణ:
అక్టోబర్ 16న కర్ణాటకలోని కార్వార్‌లో INS Samarthak అనే నౌకను భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది. ఈ నౌకను భారతదేశంలో తయారు చేశారు. ఇది అనేక రకాల పనులకు ఉపయోగపడుతుంది.
Q8 UDAN పథకం తదుపరి దశ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది?
సమాదానం:
₹28,840 కోట్లు.
వివరణ:
₹28,840 కోట్లు,UDAN పథకాన్ని 2026–27 నుంచి 2035–36 వరకు అంటే సుమారుగా 10 సంవత్సరాల పాటు దీనిని అమలు చేస్తారు.దీని ద్వారా చిన్న పట్టణాలు, ప్రాంతాల్లో విమాన ప్రయాణ సౌకర్యాలను పెంచుతారు. అంతేకాకుండా కొత్త విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేస్తారు.
Q10 భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 2047 నాటికి ఎంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది?
సమాదానం:
100 గిగావాట్లు (GW).
వివరణ:
భారతదేశం అణు విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల AI, డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను అందించవచ్చు. అలాగే, 2070 నాటికి కాలుష్యాన్ని తగ్గించాలని అనుకుంటుంది. పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదలను వీలైనంత వరకు సున్నాకు చేర్చి పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటుంది.

జాతీయ కరెంట్ అఫైర్స్ 2026
Q11 గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2026 సెప్టెంబర్‌లో భారత వస్తు ఎగుమతులు ఎంత శాతం వృద్ధి సాధించాయి?
సమాదానం:
23.04% (సుమారు 23%).
వివరణ:
సెప్టెంబర్ 2026లో భారతదేశం వేరే దేశాలకు సుమారుగా 44.40 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
Q12 భారతదేశంలో సెప్టెంబర్ నెల (WPI) టోకు ధరల పెరుగుదల రేటు ఎంతగా నమోదైంది?
సమాదానం:
11.39%.
వివరణ:
Wholesale Price Index (WPI) ద్వారా వస్తువుల రేట్లు పెరిగాయా, తగ్గాయా అని తెలుసుకోవచ్చు. దీని వల్ల వస్తువులను తయారు చేసే వారికి, వ్యాపారులకు ధరల మార్పులు అర్థమవుతాయి.
Q13 Global Hunger Index ఏ సమస్యల తీవ్రతను తెలియజేస్తుంది?
సమాదానం:
పోషకాహార లోపం,పిల్లల ఎదుగుదలలో ఆటంకం,ఆకలి స్థాయి,పిల్లల మరణాల రేటు.
వివరణ:
దేశంలో ప్రజలకు సరిపడా ఆహారం దొరుకుతోంది, పిల్లలకు సరైన పోషకాహారం అందుతోందా లేదా అని తెలుసుకోవచ్చు. అలాగే, ఐదేళ్లలోపు పిల్లలు ఎంతమంది మరణిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు.
Q14 2026 అక్టోబర్‌లో కేంద్ర విద్యాశాఖ ఏ కొత్త కార్యక్రమానికి ఆమోదం తెలిపింది?
సమాదానం:
మొత్తం ఐదు సాంప్రదాయ భాషల కోసం 5 Centres of Excellence (ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు) ఏర్పాటు చేయడానికి కేంద్ర విద్యాశాఖ తెలపడం జరిగింది .
వివరణ:
మొత్తం ఐదు భాషలు అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాళీ, ప్రాకృత ,ఈ బాషల గురించి విద్యార్థులు బాగా నేర్చుకోవాలని, పరిశోధనలు చేయడానికి వేరే వేరే కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.
Q15 PM-SETU కార్యక్రమం ఏ రంగంలో నైపుణ్యాలను పెంచడానికి ఉపయోగపడుతుంది?
సమాదానం:
పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ITIs), నైపుణ్యాభివృద్ధి.
వివరణ:
PM-SETU కార్యక్రమం ద్వారా యువతకు ఉద్యోగాలు రావడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తారు. అలాగే, ITIల్లో శిక్షణను మెరుగుపరుస్తారు, కాబట్టి యువత పరిశ్రమల్లో పనివంతులుగా చేయడానికి సిద్ధమవుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే యువతకు మంచి ఉద్యోగాలు రావడానికి అవసరమైన పనులు నేర్పించడం, ITIల్లో మంచి శిక్షణ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
Q16 అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తింపు పొందిన సుఖ్నా ఎక్కడ ఉంది?
సమాదానం:
చండీగఢ్
వివరణ:
రామ్‌సర్ గుర్తింపు అంటే ముఖ్యమైన చెరువులు,నీటి సరస్సులు, నీటి ప్రాంతాలను కాపాడటానికి ఇచ్చే అంతర్జాతీయ ఒక గుర్తింపు.అక్టోబర్ 2026లో సుఖ్నా వెట్‌ల్యాండ్, సౌజ్ ఝీల్ అనే రెండు ప్రాంతాలు ఈ జాబితాలో చేరాయి. మన భారతదేశంలో రామ్‌సర్ ప్రాంతాల సంఖ్య 103కు చేరింది.
Q17 పర్యావరణాన్ని కాపాడుతూ దీపావళి జరుపుకోవాలని సూచించే ప్రచారం ఏ కార్యక్రమంలో భాగం?
సమాదానం:
మిషన్ LiFE.
వివరణ:
ఈ ప్రచారం ద్వారా ప్రజలు తెలుసుకోవాలిసిన విషయాలు ఏంటంటే పటాకులు కాల్చకుండా, కాలుష్యం తగ్గించేలా దీపావళిని జరుపుకోవాలని తెలియజేస్తున్నారు. మట్టి దీపాలు వెలిగించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, చెత్తను సరిగ్గా పారవేయాలి ,ఇలాంటి మంచి అలవాట్లను ప్రోత్సహిస్తున్నారు. వీటిని పాటించడం వళ్ళ ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము.
ప్రిపేర్ అయ్యే విధానం : ఈ 17 కరెంట్ అఫైర్స్ మేము సొంతంగా వార్త పత్రికలు చీదివి సొంతంగా రాసినవి.మీరు ప్రిపేర్ అయ్యే విధానం బట్టి మీ మార్కులు మీ సొంతం అవుతాయి.కరెంట్ అఫైర్స్ అనేది కీలకమైన సబ్జెక్టు.మీరు డైలీ ప్రిపేర్ అవుతేనే APPSC గ్రూప్స్ 1,2,3,4 పాస్ అవ్వగలుగుతారు.కాబట్టి ప్రతిరోజు చదవడం మంచింది.

1 Comments