తెలుగు కరెంట్ అఫైర్స్ 2026:ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు (21–25 అక్టోబర్ 2026)
ముఖ్యమైన గమనికలు: తెలుగు కరెంట్ అఫైర్స్ 2026, APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్. ఈ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు మరియు వాటి వివరణలు సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడ్డాయి. మీరందరూ బాగా చదువుకుని ఉన్నత ప్రమాణాలను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము.
ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026
Q1 2026 అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏ పోస్టుకు ఆన్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ వదిలింది?
సమాదానం:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer).
వివరణ:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు.2026 అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ వదిలింది.ఈ ఉద్యోగ పోస్టుకు దరఖాస్తులు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంబంధించిన అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.దరఖాస్తు చేయడానికి ముందు పోస్టు పేరు, అర్హతలు, దరఖాస్తు ప్రారంభం తేదీ, చివరి తేదీ ,వంటి వివరాలను చూసుకోవాలి.
Q2 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నియామకాలకు 2026 అక్టోబర్ 21న సంబంధించి నోటిఫికేషన్‌ను ఏ సంస్థ ప్రకటించింది?
సమాదానం:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).
వివరణ:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest beat Officer) అనేది అటవీ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్సైటులో అప్లై చేసుకోవాలి. 2026 అక్టోబర్ 16న దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభమైన తేది. నవంబర్ 05, 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది,ఈ తేదీ తరువాత దరఖాస్తు చేసే లింక్ గడువు ముగుస్తుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు.
మొత్తం ఖాళీలు వచ్చేసి 23 పోస్టులు అయితే దీనికి జీతం వచ్చేసి సుమారుగా ₹25,220 నుంచి ₹80,910 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు.
Q3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశించిన సంస్థ ఏది?
సమాదానం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC).
వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 21, 2026న రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) నిలిపివేసింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడానికి వచ్చిన కొందరు అభ్యర్థులను ఇబంధికరంగా నిలిపివేశారని సమాచారాలు బయటకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేశారు . సుప్రీంకోర్టు ఈ ఫిర్యాదులన్నిటిని పరిశీలించాలని చెప్పింది. ఎన్నికలు న్యాయంగా, నిజాయతిగా జరగడం చాలా ముఖ్యం అని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. అందువల్ల ఫిర్యాదులపై విచారణ చేయాలనీ, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Q4 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేసిన పట్టణ సంస్థల మొత్తం సంఖ్య ఎంత ?
సమాదానం:
100.
వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ నిలిపివేసిన పట్టణ స్థానిక సంస్థలు మొత్తం మూడు ,అందులో మొదటిది 13 మున్సిపల్ కార్పొరేషన్లు, రెండవది 87 మున్సిపాలిటీలు మరియు మూడవది నగర పంచాయతీలు ఉన్నాయి.పెద్ద నగరాలను స్థానిక సేవలు మరియు పరిపాలన బాధ్యతలను మున్సిపల్ కార్పొరేషన్లు చూసుకుంటాయి.
Q5 ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై సుప్రీంకోర్టును సంప్రదించిన పార్టీ ఏది?
సమాదానం:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP).
వివరణ:
సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం చాల ముఖ్యం. ఎన్నికల ప్రక్రియను న్యాయంగా , పారదర్శకంగా జరిగేలా చూసుకోవడం ఎన్నికల సంఘం యొక్క ముఖ్య బాధ్యత.కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో , పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా కొంత మంది మనుషులు అడ్డుకున్నారు. దీనిమూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వెయ్యలేదు. ఈ సమస్యను పరీక్షించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీమ్ కోర్ట్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదులను వారి సమస్యలను పరిశీలించిన సుప్రీంకోర్టు, ఈ ఆరోపణలపై కచ్చితంగా విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Q6 పంచాయతీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతంపై వివాదం మళ్లీ చర్చకు వచ్చింది?
సమాదానం:
కోటియా ప్రాంతం.
వివరణ:
కోటియా అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఒక ప్రాంతం.అయితే పంచాయతీ ఎన్నికల విషయంలో ముందులాగే మళ్లీ వివాదం మొదలైంది.ఈ వివాదం ఎలా మొదలైనది అంటే, కోటియా ప్రాంతంలోని మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణహించింది. దీనిమూలంగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య మరోసారి చర్చకు వచ్చింది.సమస్య విషయానికి వస్తే, ఈ ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందుతుంది, అక్కడి ప్రజలకు ఎవరు పరిపాలనా సేవలు అందించాలనే విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొనింది.

తెలుగు కరెంట్ అఫైర్స్ 2026
Q7 భారత రాజ్యాంగంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణను ఏ అధికరణం వర్తిస్తుంది?
సమాదానం:
అధికరణం 243ZA.
వివరణ:
భారతదేశ రాజ్యాంగంలో మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా అధికరణం ఉంది.పేరు 243ZA అధికరణం. 243ZA అధికరణం ప్రకారంగా చుస్తే మున్సిపాలిటీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి,ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి , ఎన్నికల ప్రక్రియను ఎవరు పర్యవేక్షించాలి, ఎన్నికల గురించి అవగాహన ఎవరికీ తెలియజేయాలి అనే విషయాలను ఇది వివరిస్తుంది.ముక్యంగా ఈ బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయి.
Q8 ఆంధ్రప్రదేశ్ తీరానికి భారీ వర్షాలు తెచ్చే అవకాశం ఉన్న వాతావరణ వ్యవస్థ ఏ ప్రాంతంలో ఏర్పడింది?
సమాదానం:
బంగాళాఖాతంలో.
వివరణ:
బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా తాయారు అవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలియజేసింది.ఈ బంగాళాఖాతం తూర్పు, మధ్య దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది.ఇది కొంచంగా బలపడితే తుఫానుగా మారవచ్చు.అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు, విపరీతమయిన గాలులు వీచే అవకాశం ఉంటుంది. తీరా ప్రాంతాల్లో ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తారు,ఈ అల్పపీడనం వారికీ నష్టం కలిగించవచ్చు.
Q9 2026 అక్టోబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్న తుపానునుకు ఏ పేరు పెట్టారు?
సమాదానం:
అర్ణబ్ (Arnab).
వివరణ:
ఈ తుపానుకు ఆర్నబ్ (Arnab) అనే పేరును బంగ్లాదేశ్ సూచించింది. అయితే, అక్టోబర్ 25, 2026 నాటికి కూడా ఈ తుపాను వ్యవస్థ ఇంకా బలమైన దశలోనే ఉంది. ఇది పేరుకు తగ్గట్టు తుపానుగా మారితేనే ఆ పేరును ఉపయోగిస్తారు.లేదంటే ఉపయోగించారు.
Q10 ‘అర్ణబ్’ అనే తుపాను పేరు ఏ దేశం నుంచి ప్రతిపాదించబడింది?
సమాదానం:
బంగ్లాదేశ్.
వివరణ:
ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏవైనా తుపాన్లు ఏర్పడితే వాటికీ ప్రత్యేక పేర్లు పెడతారు. ఈ పేర్లను భారతదేశం, బంగ్లాదేశ్ వంటి దేశాలు ముందుగానే సూచిస్తాయి. అయితే ఈ తుపాను పేర్లను క్రమం ప్రకారం కేటాయిస్తారు,ఎలాగంటే మహాసముద్రం ప్రాంతంలో వాతావరణం తుపానుగా మారినప్పుడు,తుపాను యొక్క ప్రభావాన్ని బట్టి పేర్లు పెడతారు. ఇలా పేర్లు పెట్టడం వల్ల ప్రజలు ముందుగానే అప్రమత్తం అవుతారు
Q11 ఏపీలో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలను జారీ చేశారు?
సమాదానం:
వర్షం నీరుని నిల్వ చేసి ఆ నీరుని వినియోగించుకోవడం. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను నవంబర్‌లో తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు.
వివరణ:
భారీ వర్షాల గురించి ఇందు సంస్థ అంచనాల పరంగా , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు సాగునీటి శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలని అయన పేర్కొన్నారు. వర్షపు నీటిని వృథా చేయకుండ జలాశయాలు, సాగునీటి చెరువులను నింపాలని, నీటి వనరులను వృధా చేయకుండా వినియోగించాలని అయన ఆదేశించారు.
Q11 అక్టోబర్ 2026లో వార్తల్లో నిలిచిన APPSC గ్రూప్–2 నియామకాల్లో మొత్తం పోస్టుల సంఖ్య ఎంత?
సమాదానం:
686 తాత్కాలిక ఖాళీలు.
వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APPSC గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నం. 37/2026 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ లో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు 2026 నవంబర్ 10 నుంచి నవంబర్ 30 లోపు అప్లై చేసుకోవచ్చు . అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు పోస్టుల వివరాలు, అర్హతలు, జాగ్రత్తగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. APPSC అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.

కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు :
1. రోజు చదివినది బుక్కులో రాయండి : ముఖ్యమైన వార్తలు, తేదీలు, వ్యక్తుల పేర్లు , పథకాల పూర్తి వివరాలు, అవార్డుల పేర్లు వంటి అంశాలను సులభంగా గుర్తుంచుకునేలా రాసుకోండి.
2 . అంశాల వారీగా చదవండి: జాతీయ, అంతర్జాతీయ, ఆంధ్రప్రదేశ్, ఆర్థిక వ్యవహారాలు, క్రీడలు, సైన్స్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలు విభాగాలుగా చేసి చదవండి. ఎందుకంటే మీరు చదివిన ప్రతి ఒక్కటి అర్థవంతంగా ఉంటుంది.
3.ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి: చదివిన అంశాలపై రోజూ ప్రశ్నలు (MCQs) సాధన చేయండి.ఇలా చేయడం వల్ల సమాధానం గుర్తుంటుంది.

1 Comments