APPSC గ్రూప్ 1,2,3,4 కరెంట్ అఫైర్స్ :ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు (అక్టోబర్ 5, 2026)
📅 October 4, 2026 | Devendra Jaladurgam
గమనిక:APPSC గ్రూప్ 1,2,3,4 కరెంట్ అఫైర్స్, అక్టోబర్ 5, 2026లో అందుబాటులో ఉన్న తాజా నివేదికల ఆధారంగా రూపొందించబడ్డాయి. దయచేసి ఒకటికి రెండు సార్లు చదివి మీ ప్రేపరషన్ ని మేము ఇచ్చే డైలీ కరెంటు అఫైర్స్ ద్వారా మరింత మెరుగుపరుచుకోండి.ఎందుకంటే మీ మంచి భవిష్యత్యే మాకు మొదటి పునాది, కావున అందరూ కష్టపడి చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.
APPSC గ్రూప్ 1,2,3,4 కరెంట్ అఫైర్స్
Q1. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ 2.0లో ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ఇళ్ల సంఖ్య ఎంత?
జవాబు:
3 లక్షల ఇళ్లు
వివరణ:
గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద కుటుంబాలకు అలాగే ఇల్లు కట్టుకునే స్తోమత లేని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) 2.0 కింద ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల ఇళ్లను ఇస్తున్నట్టు మంజూరు చేసింది. ఈ యోజన కింద పేదలు మరింత జాగ్రత్తగ తమ ఇళ్లల్లో ఉండవచ్చు.
Q2. 3 లక్షల ఇళ్ల మంజూరుతో ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ఆర్థిక ప్రయోజనం ఎంత?
జవాబు:
₹3,600 కోట్లు.
వివరణ:
శివరాజ్ సింగ్ చౌహాన్ 3 లక్షల ఇళ్ల మంజూరు పత్రాన్ని సీఎం చంద్ర బాబు నాయుడుగారి అందజేశారు. వీటి విలువ రూ.3,600 కోట్లు, సగటున ఇంటికి సుమారు రూ.1.2 లక్షలు ఉండవచ్చు. ఈ నిదుల వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఇళ్ల నిర్మాణ పనులు తొందరగా అవ్వడం జరుగుతుంది .
Q3. పేద కుటుంబాలందరికీ సొంత ఇల్లు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏది?
జవాబు:
2029.
వివరణ:
ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుగారు 2029 నాటికల్లా ఎవరైతే ఇల్లులు పొందడానికి అర్హులు ఉన్నారో వాళ్లందరికీ నాణ్యమైన ఇళ్లను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది . ఈ కార్యక్రమం పేదలకు మరింత ఆనందింప చేయపడే విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తం 9 లక్షల ఇళ్లు వస్తాయని సీఎం చెప్పారు..
Q4
. ఆంధ్రప్రదేశ్‌లో నేచురల్ ఫార్మింగ్‌కు ప్రోత్సాహం అందిస్తున్న కేంద్ర మంత్రి ఎవరు?
జవాబు:
శివరాజ్ సింగ్ చౌహాన్.
వివరణ:
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్‌లో పాత పద్దతిలో వ్యవసాయం అలాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అభినందించారు. పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తున్న వారికీ అయన అభినంచారు.రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, ప్రకృతితో ఆధారపడి పంటలను సాగు చేయడం సహజ వ్యవసాయ ముఖ్య లక్ష్యం.
Q5. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్ని లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది?
జవాబు:
50 లక్షల ఎకరాలు.
వివరణ:
ఆంధ్రప్రదేశ్‌లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తక్కువ చేయటంతో పాటు భూసారాన్ని మెరుగ్గా సంరక్షించాలని సరిగ్గా ప్రభుత్వం భావిస్తోంది.పర్యావరణాన్ని కాపాడేందుకు సహజ వ్యవసాయా విధానాలను అమలు చేయడం ఈ కార్యక్రమంలో ప్రధాన భాగం.
Q6. SC, ST కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ సౌకర్యం కల్పించేందుకు APSPDCL ఎన్ని కనెక్షన్లను ఏర్పాటు చేసింది?
జవాబు:
1 లక్ష కనెక్షన్లు.
వివరణ:
ఆంధ్ర ప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL), ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కోసం లక్ష రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లను పూర్తి చేసింది . దీని వళ్ళ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ అవసరమైన పవర్ ని వాడుకోవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ కీలక మైలురాయిని సాధించింది అని అనవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇళ్ల స్థాయిలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తోంది.
Q7. APSPDCL రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమంలో లక్ష కనెక్షన్లకు సంబంధించిన మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత?
జవాబు:
210 మెగావాట్లు (MW).
వివరణ:
ఆంధ్ర ప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL), లక్ష రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్ల ద్వారా మొత్తం 210 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సౌర విద్యుత్ వినియోగం పెరిగిపోవడం వల్ల సంప్రదాయ విద్యుత్ పై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంటుంది .
Q8. APSPDCL సౌర విద్యుత్ కనెక్షన్ల కార్యక్రమాన్ని కేంద్రంలోని ఏ పథకం ద్వారా అమలు చేస్తోంది?
జవాబు:
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన.
వివరణ:
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ,ఈ కేంద్ర పథకం ద్వారా సాధారణ కుటుంబాలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా వారు అందజేస్తున్నారు. ఇంట్లో రోజువారీ విద్యుత్ అవసరాల్లో కాస్త భాగాన్ని సౌరశక్తితో తీర్చుకోవడం వల్ల విద్యుత్ బిల్లుళ్లు మీద భారం తగ్గే అవకాశం ఉంటుంది.
Q9. CII రీజినల్ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 నిర్వహణకు ఎంపికైన ప్రదేశం ఏది?
జవాబు:
IIM విశాఖపట్నం.
వివరణ:
విశాఖపట్నం లో 2026 అక్టోబర్ 7న జరగనున్న ఈ సదస్సుకు పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు,పెద్దలు హాజరుకానున్నారు. వ్యాపార వర్గాలు అలాగే ప్రాంతాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సదస్సుకు ముఖ్య ఉద్ద్యేశం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఒకే చోట హాజరు కావడం వళ్ళ రాష్ట్రానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.
Q10. అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేయనున్న పాన్IIT అమరావతీ కౌన్సిల్ ఏ సంస్థకు చెందినది?
జవాబు:
పాన్IIT.
వివరణ:
IITల్లో చదివిన పూర్వ విద్యార్థులు దేశంలో, విదేశాల్లో వివిధ రంగాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. వారి అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను అమరావతి అభివృద్ధికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.IIT పూర్వ విద్యార్థుల సహాయం తీసుకుని అమరావతిని మరింత కొత్తగా,అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలని ఈ పాన్IIT అమరావతీ కౌన్సిల్ ని ప్రవేశపెట్టారు.
Q11. సముద్రానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేశారనే కేసును ఏపీకి చెందిన ఏ పోలీసు విభాగం దర్యాప్తు చేసింది?
జవాబు:
కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం.
వివరణ:
సోషల్ మీడియా ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని విదేశీ వ్యక్తులకు చేరిందనే ఆరోపణలు రావడంతో వెంటనే అనుమానాస్పదంగా ఉన్న నేవీకి చెందిన ఓ సైలర్‌ను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.దీంట్లో భాగంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం వారు కేసును చేపట్టారు.
Q12. సేవా సంకల్ప యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశం ఏది? ముగింపు ఎక్కడ జరగనుంది?
జవాబు:
తిరుపతిలో ప్రారంభమై వారణాసిలో ముగియనుంది.
వివరణ:
సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 30న తిరుపతి నుంచి ప్రారంభమైంది. తర్వాత అక్టోబర్ 8న వారణాసికి చేరుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తిరుపతి నుంచి వారణాసికి చేరుకునేందుకు సుమారుగా 2500 కిలోమీటర్లు ఉంటుంది.
Q13. 2026 దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ప్రకటించిన సెలవుల కాలం ఎంత?
జవాబు:
అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21 వరకు.
వివరణ:
2026 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21 వరకు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
Q14. ఆంధ్రప్రదేశ్‌లో “అమరజీవి జలధార” కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
జవాబు:
కడప జిల్లా ప్రొద్దటూరు
వివరణ:
కడప జిల్లా ప్రొద్దటూరు లో 5 అక్టోబర్ 2026న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ పథకాన్ని ప్రారంభించారు .
Q15. అమరజీవి జలధార పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేశారు?
జవాబు:
30,156 కోట్లు
వివరణ:
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు ఇవ్వాలనే మంచి లక్ష్యంతో “అమరజీవి జలధార” పథకాన్ని మొదలుపెట్టారు. ఈ పథకం ద్వారా గ్రామాలకు త్రాగునీరు ఇవ్వాలని సుమారుగా రూ.30,156 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు .
Q16. జలధార పథకంలో ప్రతిపాదించిన పైప్‌లైన్ నెట్‌వర్క్ సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
జవాబు:
77,243 కి.మీ.
వివరణ:
“అమరజీవి జలధార” పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 77,243 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి శుద్ధి కేంద్రాల మొత్తం సామర్థ్యం సుమారుగా రోజుకు 1,426 మిలియన్ లీటర్లు (MLD)గా ఉంటుంది. అంటే రోజు చాల ఎక్కువ శాతం లో నీళ్లు శుద్ధి జరుగుతాయి .
Q17. స్వాతంత్ర్య ఉద్యమంలో “అమరజీవి” బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?
జవాబు:
పొట్టి శ్రీరాములు.
వివరణ:
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి చివరకు ప్రాణత్యాగం చేశారు అందుకే ఆయనను ‘అమరజీవి’ గా పిలుస్తారు. అయనను గుర్తుచేసుకొని “అమరజీవి జలధార” అనే పేరు పెట్టారు.
1 Comments