ఆంధ్రప్రదేశ్ గరుడ పథకం 2026 -పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹10,000 సహాయం
బ్రాహ్మణ కుటుంబాలకు ₹10,000 సహాయం
ఆంధ్రప్రదేశ్ గరుడ పథకం 2026
ఇంట్లో ఒకరిని కోల్పోవడం చాలా బాధాకరం ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి,చాలా మంది డబ్బులు లేక అంతక్రియలకు బయట అప్పు చేసి మరి చేస్తారు, ఉన్నవాళ్లు ఈబ్బంది పడకపోయిన, లేనివాళ్లు మాత్రం చాలా ఈబ్బంది పడతారు.అలాంటి కుటుంబాలను ఆదుకోవడానికే Andhra Pradesh ప్రభుత్వం గరుడ అనే పథకం ప్రవేశపెట్టింది.ఈ పథకం ఒక్కముఖ్య ఉద్దేశం,అంత్యక్రియల ఖర్చుల కోసం అక్షరాల 10,000 వేల రూపాయలు సహాయం చేస్తోంది. ఈ పథకం పూర్తి పేరు Garuda Scheme for Funeral Expenses – GSFE.
గరుడ పథకం అంటే ఏమిటి ?
Garuda Scheme for Funeral Expenses – GSFE అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ABC) అమలు చేసే పథకం.మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియల ఖర్చులు భరించే స్థోమత ఆ కుటుంబంలో ఉన్నవారికి లేనప్పుడు ఆర్థిక సహాయం అందించడం దీని ప్రదా నా ముఖ్య లక్ష్యం.ఇదే కార్పొరేషన్ వేదవ్యాస, గాయత్రి వంటి విద్యా సంబంధిత పథకాలను కూడా నిర్వహిస్తోంది.
ఈ గరుడ పథకం పేద బ్రాహ్మణ కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ గరుడ పథకం పొందాలంటే అర్హతలు ఏమిటి?
ప్రభుత్వ పథకాల పోర్టల్స్‌లో అందించిన వివరాల ప్రకారం :
- దరఖాస్తుదారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తూ ఉండాలి.
- భార్య/భర్త, కుమారుడు/కుమార్తె, తల్లిదండ్రులు, సోదరుడు లేదా మనవడు వంటి బంధువులు దరఖాస్తు చేయవచ్చు.వీరిలో ఎవరూ కాకపోయినా ఈ పథకానికి అర్హులు కాదు
- మరణించిన వ్యక్తికి దగ్గరి బంధువు/ మరియు చట్టబద్ధ వారసుడు అయి ఉండాలి.ధూరపు బందువులను లెక్కించరు.
- మరణించిన వ్యక్తి ఖచ్చితంగా బ్రాహ్మణుడై ఉండాలి,లేదంటే అర్హులు కారు.
- చాల మంది ఈ విషయాన్నీ మరిచి పోతు ఉంటారు అదేమిటంటే ,కుటుంబ వార్షిక ఆదాయం ₹75,000 మించకూడదు.లేదంటే అర్హులు కారు.

ప్రభుత్వం నుండి ఎంత సహాయం లభిస్తుంది?
ప్రభుత్వం నుండి ఎంత సహాయం వస్తుంది అంటే,అంత్యక్రియల ఖర్చుల కోసం ₹10,000 మొత్తంగా ఒకేసారి అందిస్తారు . వ్యక్తి అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.
Apply చేసే ముందు కావలసిన పత్రాలు
- ముందుగా ప్రభుత్వం జారీ చేసిన – వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం.(Death Cerificate)
- దరఖాస్తుదారు పేరుపై బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ ఉండాలి,(ఆంధ్రా బ్యాంక్ లేదా SBI) ప్రస్తుతం ఏ బ్యాంకులు అంగీకరిస్తారో నిర్ధారించుకోని Apply చేయండి.(Bank Pass book)
- కుల/ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఖచ్చితంగా ఉండాలి (Income cast)
కింది ఉన్న వాటిలో అన్ని తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి
- దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు
- మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు
- మరణ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- చట్టబద్ధమైన వారసుడినని స్వీయ ప్రకటన
దరఖాస్తు చేసే విధానం
- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ (andhrabrahmin.ap.gov.in) లోని Schemes విభాగానికి వెళ్ళండి.
- గరుడ పథకాన్ని ఎంచుకుని, తాజా మార్గదర్శకాలను చదవండి.
- దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన పత్రాలను జత చేయండి.
- దరఖాస్తును సమర్పించండి. కార్పొరేషన్ అధికారులు ఫారం, పత్రాలను పరిశీలించి ఆమోదిస్తారు.
- స్టేటస్ తెలుసుకోవడానికి మీ దరఖాస్తు రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరచుకోండి.
దరఖాస్తు చేసే ముందు తప్పక చూడండి
ఈ పథకం గతంలో అమలైంది, కానీ 2019 తర్వాత నిలిచిపోయింది. తాజాగా దీనిని మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం పథకం వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. మీరు బ్రాహ్మణులు అయితే దరఖాస్తు చేసుకోండి. కుటుంబలో వ్యక్తి మరణించిన 45 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.అందువల్ల కుటుంబంలో మరణం జరిగిన తర్వాత అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా అందువల్లనా అధికారులను సంప్రదించడం మంచిది.గరుడ పథకం ప్రతి కుటుంబానికి సాధారణంగా ₹10,000 ఇచ్చే పథకం కాదు. అర్హతలు, ఆదాయ పరిమితి, బంధుత్వం, పత్రాలు మరియు ఇతర నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల దరఖాస్తు చేసే ముందు తాజా అధికారిక మార్గదర్శకాలను పరిశీలించాలి, ఆ తరువాత ముందుకు వెళ్ళండి.
చివరి మాట
ఆంధ్రప్రదేశ్ గరుడ పథకం 2026 పేద బ్రాహ్మణ కుటుంబాలకు కుటుంబ సభ్యుడి మరణ సమయంలో అంత్యక్రియల ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన పథకం. అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని,దరఖాస్తు చేయడం ద్వారా అర్హత ఉన్న కుటుంబాలు ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నించవచ్చు.₹10,000 అన్ని ఖర్చులకు సరిపోకపోవచ్చు, కానీ బాధాకరమైన సమయంలో ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకానికి అర్హులైన కుటుంబం మీ దగ్గర ఉన్నా లేదా బంధు మిత్రులు ఉన్నా మీకు తెలిస్తే, ఈ సమాచారాన్ని వారితో పంచుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు – FAQs
1. గరుడ పథకం ద్వారా ఎంత సహాయం లభిస్తుంది ?
మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గరుడ స్కీం కింద అక్షరాలా 10,000 వేళా రూపాయలు అందిస్తుంది.
2. దరఖాస్తు చేయడానికి గడువు ఎంత సమయం కేటాయించింది?
అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం మరణించిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేయాలి.ఒకవేళ అప్లై చేసుకోకపోతే స్కీం కి ఎలిజిబుల్ అవ్వరు.
4. ఆదాయ పరిమితి ఎంత?
అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం ₹75,000కు మించకూడదు అని పేర్కొన్నారు
గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. అర్హతలు, మొత్తం, విధానాలు కొన్నిసార్లు మారవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక పోర్టల్ లేదా కార్పొరేషన్ ద్వారా ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకోండి.

2 Comments