భారత రాజ్యాంగం కరెంట్ అఫైర్స్ 2026: సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు స్పందన, ఎన్నికల సంఘం ఆర్టికల్ 324
భారత రాజ్యాంగం కరెంట్ అఫైర్స్ 2026
ముఖ్యమైన గమనికలు: భారత రాజ్యాంగం కరెంట్ అఫైర్స్ 2026, APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ ఇంకా మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడతాయి. మీరందరూ బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
1. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
ఈ మధ్య కాలంలో డిజిటల్ మోసాలు చాలావరకు జరుగుతున్నాయి. అయితే డిజిటల్ నేరగాళ్లు అమాయక ప్రజల నుంచి డబ్బు దోచేస్తుంటారు. అమాయక ప్రజలని మోసం చేసి డబ్బు డిజిటల్గా కొట్టేయడమే వీళ్ళ టార్గెట్. ఇందులో నేరగాళ్లు తాము పోలీసులమని లేదా బ్యాంకు మేనేజర్ అని, ED వంటి దర్యాప్తు సంస్థల నుంచి పెద్ద అధికారులమని చెప్పుకుంటారు. ఆ తరువాత బాధితుడిపై క్రిమినల్ కేసు ఉందని, అరెస్ట్ చేస్తామని, చేయని తప్పులు చేసారు అని, బెదిరించి డబ్బులు బదిలీ చేయిస్తారు.

డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టడానికి సుప్రీమ్ కోర్టు వివరించి
1.పోలీసులు, సిబిఐ ఆఫీసర్స్ లేదా ఇతర ప్రభుత్వ అధికారులమని ఎవరైనా వీడియో కాల్స్ లేదా ఆడియో కాల్స్ చేసి ప్రజలను మోసం చేస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది.
2.సుప్రీమ్ కోర్ట్ బ్యాంకు సంబంధించి ఒక విషయాన్నీ చెప్పింది.కొన్నిసార్లు బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు డబ్బును పోగొట్టుకుంటారు.ఆ సందర్భాల్లో బాధితులకు అంటే ఖాతాదారునికి పరిహారం అందించే విషయంపై కోర్టు దృష్టి పెట్టింది.
పరీక్షలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
2.RBI అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ముఖ్యమైన సంస్థ.
3.I4C (Indian Cyber Crime Coordination Centre) అనేది భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం.
4.ఇక్కడ ఈ అంశం ప్రకారంగా గమనిస్తే, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా చూస్తే చట్టబద్ధమైన పద్ధతి పాటించకుండా ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను అపహరించకూడదు.ఈ ఆర్టికల్ కాస్త గమనించాల్సిన విషయం.
2.భారత ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 | APPSC కరెంట్ అఫైర్స్ 2026
ముందుగా SIR (Special Intensive Revision) అంటే ఏంటో తెలుసుకుందాం.SIR అంటే ఓటర్ల వివరాలను ముఖ్యంగా, పెద్ద ఎత్తున పరిశీలించి, అవసరమైన మార్పులు చేయడం. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాను సవరించే పనిలో, ఓటర్ల యొక్క వివరాలు తప్పు ఉంటె వాటిని పరిశీలిస్తున్నారు.ఈ పరిసీలించే పద్దతి భాగంగా “Logical Discrepancy (LD)” అనే విధానాన్ని వాడుతున్నారు.
ఈ విధానంపై సుప్రీంకోర్టు ఏమి చెప్పింది?

- ఓటర్ల వివరాలు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో తప్పులను గుర్తించే తాత్కాలిక విధానం Logical Discrepancy (LD) అమలులో ఉన్నప్పటికీ,అదే తుది నిర్ణయం కాదు అని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది.
భారత రాజ్యాంగం కరెంట్ అఫైర్స్ 2026 – గుర్తుపెట్టుకోవలసిన విషయాలు
భారత రాజ్యాంగం కరెంట్ అఫైర్స్ 2026
నోట్ : ఈ అంశాలు గోవేర్నమేంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకు ఉపయోగ పడుతుంది.
