ఈరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు 2026 :ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు (6–7 అక్టోబర్ 2026)
📅 October 8, 2026 | Devendra Jaladurgam
ముఖ్యమైన గమనికలు :ఈరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు 2026, APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్. ఈ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు మరియు వాటి వివరణలు సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడ్డాయి. మీరందరూ బాగా చదువుకుని ఉన్నత ప్రమాణాలను సాధించాలని మేము కోరుకుంటున్నాము.
AP Current Affairs 2026 in Telugu: చదవండి 6–7 October ముఖ్యమైన 10 ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు. APPSC, Police, Group Exams కోసం ఉపయోగకరం.
1. ఆంధ్రప్రదేశ్‌లో 2026 ఖరీఫ్ కాలంలో వర్షపాతం ఎంత శాతం తక్కువగా నమోదైంది?
ఇలాగే ఇంకో ప్రశ్న
2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన వర్షపాతం లోటు ఎంత?
జవాబు:
53.4 శాతం
వివరణ:
2026 జూన్ నుంచి ఆగస్టు వరకు ఆంధ్రప్రదేశ్‌లో పతి సంవత్సరం సాధారణంగా కురవాల్సిన వర్షాలతో పోలిస్తే 53.4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే ఏ సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన వర్షం సగానికి సగం పైగా లోటు ఏర్పడిందని అర్థం.ఈ వర్షపాతం లోటు కారణంగా వ్యవసాయం, పంటల సాగు, నీటి లభ్యత వంటి అంశాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.ఈ పరిస్థితికి ఎల్‌నినో ప్రభావం కూడా ఒక కారణంగా చెప్పబడింది.
2. ఏపీలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న ప్రాంతం ఏది?
ఇలాగే ఇంకో ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రాంతం ఏది?
జవాబు:
రాయలసీమ
వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు ప్రభావం రాయలసీమ ప్రాంతంలో చాల ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కరువు ప్రభావం ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే, మొత్తం 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించారు. వీటిలో 186 మండలాలు రాయలసీమ ప్రాంతానికి చెందినవే. అందువల్ల కరువు ప్రభావిత ప్రాంతం రాయలసీమగ అనవచ్చు.పరిస్థితి తీవ్రంగా ఉన్న మండలాలను చూస్తే , మొత్తం 283 మండలాలు తీవ్రమైన కరువు ప్రభావితంతో ఉన్నాయి.283 మండలాల్లో 159 మండలాలు రాయలసీమలోనే ఉన్నాయి. దీనివల్ల రాయసీమ లో వ్యవసాయం, పంటల సాగు, తాగునీరు అలాగే సాగునీటి లభ్యతపై ఒత్తిడి ఎక్కువగా జరుగుతుంది .
ఈరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు 2026
3.ఏపీలో ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియపై BLOలకు అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఏమిటి?
ఇలాగే ఇంకో ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన సమయంలో BLOలకు ఇచ్చిన ముఖ్యమైన ఆదేశాలు ఏమిటి?
జవాబు:
ఫొటోలు, వీడియోలు నమోదు చేయాలని ఆదేశించారు.
వివరణ:
జిల్లా ఎన్నికల పై అధికారులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఓటర్ల వివరాలను పరిశీలించే సమయంలో అవసరమైన ఫొటోలు, వీడియోలను నమోదు చేయాలి .ఎదుకంటే ఇలా చేయడం వల్ల ఓటర్ల వివరాల పరిశీలన సక్రమంగా జరిగిందో లేదో తెలుసుకోవచ్చు, అలాగే అవసరమైనప్పుడు వివరాలను తనిఖీ చేయడానికి బాగా వీలు కూడా ఉంటుంది.ఈ చర్యల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి అర్హుడికి తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం.
4. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఏ తేదీన విడుదల కానుంది?
ఇలాగే ఇంకో ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తేదీ ఏది?
జవాబు:
అక్టోబర్ 16, 2026
వివరణ:
ఓటర్ల జాబితా ప్రక్రియలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటె మార్పులు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 16న ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు నిర్ణయించారు.ఇంకో విషయం ఏంటంటే మీకు ఓటు వేసే అర్హత ఉన్నప్పటికీ, ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోతే Form-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పాత్రలను పై అధికారులకు సమర్పించాలి.
5. విశాఖ ప్రాంతీయ సదస్సులో ఎంత విలువైన పెట్టుబడులకు సంబంధించిన 31 MoUలు కుదిరాయి?
ఇలాగే ఇంకో ప్రశ్న
విశాఖ ప్రాంతీయ సదస్సులో కుదిరిన 31 అవగాహన ఒప్పందాల (MoUలు) ద్వారా ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించబడ్డాయి?
జవాబు:
₹21,495 కోట్లు
వివరణ:
2026 అక్టోబర్ 7న విశాఖపట్నంలో ప్రాంతీయ సదస్సు కారణంగా మొత్తం 31 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా వివిధ రంగాల్లో కలిపి ₹21,495 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఒకవేళ ఈ పెట్టుబడులు అమలులోకి వస్తే రాష్ట్రంలో కంపెనీలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
5. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఇలాగే ఇంకో ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది?
జవాబు:
₹21,495 కోట్లు
వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, వివిధ కంపెనీలు మరియు పరిశ్రమలను ఏర్పాటు చేసేలా అలాగే వారిని ముందుకు నడిపించడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడి వళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతలందరికి ఏక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ఈరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు 2026
5. విశాఖపట్నంతో సంబంధం ఉన్న తొలి స్వదేశీ నౌకాదళ సహాయక నౌకకు పెట్టిన పేరు ఏమిటి?
ఇలాగే ఇంకో ప్రశ్న
భారతదేశం స్వదేశీంగా నిర్మించిన తొలి నౌకాదళ ఫ్లీట్ సపోర్ట్ షిప్ పేరును గుర్తించండి.
జవాబు:
“సూర్య”
వివరణ:
భారత రక్షణ రంగంలో నౌకల కోసం విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని ఫ్లీట్ సపోర్ట్ షిప్ “సూర్య” ను ప్రారంభించారు.ఫ్లీట్ సపోర్ట్ షిప్ అంటే సముద్రంలో విధులు నిర్వహించే యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనం, సంబంధించిన సామాగ్రి, సరఫరాలను అందించడానికి ఉపయోగపడే సహాయక నౌక.
APPSC కరెంట్ అఫైర్స్ 2026
6. భారతదేశపు తొలి స్వదేశీ Fleet Support Ship ‘సూర్య’ను ఏ షిప్‌యార్డ్‌లో నిర్మించారు?
ఇలాగే ఇంకో ప్రశ్న
‘సూర్య’ నౌకను నిర్మించిన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ ఏది?
జవాబు:
హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (HSL)
వివరణ:
భారతదేశంలో స్వదేశీ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల భాగంగా, ‘సూర్య’ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (HSL) సంస్థలో నిర్మించారు. ఈ సంస్థ నౌకల నిర్మాణం, మరమ్మతులు వంటి పనుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నౌక నిర్మాణం వల్ల భారతదేశానికి అవసరమైన నౌకలను దేశంలోనే తయారు చేసుకునే వంటి సామర్థ్యం మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది.
7. అక్టోబర్ 7న కేంద్ర మంత్రులతో జరిగే సమావేశాల్లో చంద్రబాబు ఏ ప్రాజెక్టుల అనుమతులపై చర్చించాలనుకున్నారు?
ఇలాగే ఇంకో ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఏ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు కోరేందుకు అక్టోబర్ 7న చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు?
జవాబు:
విశాఖ మెట్రో రైల్ అలాగే బీచ్ కారిడార్
వివరణ:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 7న ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి అయిన నరేద్రమోడీని కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు రావడంకోసం
ప్రయత్నిచడం జరుగుతుంది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు వస్తే నగరంలో ప్రజా రవాణా సౌకర్యాలు మరికాస్త మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది,దీని వళ్ళ ప్రయోజనం ఏంటంటే, ప్రయాణ సమయం తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, బీచ్ కారిడార్ ప్రాజెక్టు ద్వారా తీరప్రాంత అభివృద్ధి లభించే అవకాశం ఉంటుంది.
8. అమరావతి లిటరరీ ఫెస్టివల్ 2026 ఏ ప్రదేశంలో నిర్వహిస్తున్నారు?
ఇలాగే ఇంకో ప్రశ్న
2026లో నిర్వహిస్తున్న అమరావతి సాహిత్య మహోత్సవం ఏ నగరంలో జరుగుతోంది?
జవాబు:
SRM యూనివర్సిటీ- ఆంధ్ర ప్రదేశ్
వివరణ:
అమరావతి లిటరరీ ఫెస్టివల్ 2026 అక్టోబర్ 7 నుంచి 9 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని SRM యూనివర్సిటీ -APలో జరుగుతూ ఉంది. ఈ ఉత్సవంలో రచయితలు, కళాకారులు, విద్యార్థులు, సాహితీవేత్తలు పాల్గొని వారి ఆలోచనలు,వాళ్ళ జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నారు భవిష్యత్తులో ఎలా ఉండాలో కూడా చెప్పారు. ఈ సంవత్సరం ఉత్సవానికి “stories for a Changing World” అనే థీమ్‌ను ఎంపిక చేశారు. ఈ థీమ్ యొక్క మూయ ఉద్దేశం సమాజంలో రోజు జరుగుతున్న మార్పులు, కొత్త ఆలోచనలు, మానవ సంబంధాలు, భవిష్యత్తు ఎదుగుదలపై చూపించే ప్రభావం వంటి అంశాలను ఈ థీమ్ ఉద్దేశిస్తుంది.
9. తిరుమల శ్రీవారి నవనవ రాత్రి బ్రహ్మోత్సవాలను 2026లో ఏ సమయంలో నిర్వహించారు ?
ఇలాగే ఇంకో ప్రశ్న
తిరుమల శ్రీవారి ఆలయంలో నవనవ రాత్రి బ్రహ్మోత్సవాలు ఏ నెలలో, ఏ తేదీల్లో జరగనున్నాయి?
జవాబు:
అక్టోబర్ 12 నుండి 20
వివరణ:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 2026లో నవనవ రాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 12 నుంచి 20 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ఉత్సవాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉన్నందున తిరుమలకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు TTD ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ముందుగానే దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో TTD విడుదల చేసింది.
10. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది?
ఇలాగే ఇంకో ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి APPSC అక్టోబర్ 6న విడుదల చేసిన నోటిఫికేషన్ ఏది?
జవాబు:
గ్రూప్ -I సర్వీసెస్ నోటిఫికేషన్ 07/2026
వివరణ:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అక్టోబర్ 6న ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. వీటిలో ముఖ్యంగా Group-I Servicesకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ ఒకటి. ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, పరీక్షల వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం ఈ నోటిఫికేషన్లో ఉంది. గ్రూప్ 1 ప్రిపరేషన్ లో ఉన్నవారికి ఇది ఉపయోగ పడుతుంది.అదే రోజున అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ , హార్టికల్చర్ ఆఫీసర్ వంటి పోస్టులకు నోటిఫికేషన్లు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వివరాలను కూడా APPSC ప్రకటించింది.