Learn • Prepare • Succeed
Government Schemes

ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాన పథకం 2026 – ఇంటికి రూ.1.75 లక్షలు , 3D ప్రింటింగ్ హౌసింగ్

📅 October 7, 2026  |  Devendra Jaladurgam
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాన పథకం 2026
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ పథకం 2026
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాన పథకం 2026

ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాన పథకం 2026, “ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు” అని మన పెద్దలు ఊరికే అనలేదు.సామాన్యులకు ఒక సొంత ఇల్లు కట్టుకోవడం జీవితంలో అతిపెద్ద లక్ష్యం. ప్రతి నెల అద్దె కట్టలేక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అద్దె ఇల్లు అయినా కూడా వర్షం వస్తే నీరు కారే ఇంట్లో ఉంటాం . వేసవి కాలం వస్తే ఆలా ఇంట్లో ఉండలేక బయట ఉండలేక చాల ఇబ్బంది పడుతూ ఉంటారు . పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేని చిన్న గది. ఇవన్నీ 2026 సంవత్సరంలో కూడా జరుతున్నాయి . ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు .

తాజా కార్యక్రమంలో ఏమేం జరిగాయి?

అక్టోబర్ 4న బుర్రిపాలెంలో జరిగిన సభలో రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు.

  1. 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన : రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు.
  2. 3D ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు : బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెంలలో 117 ఇళ్లను 3D కాంక్రీట్ సాంకేతికతతో సుమారు రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు .

గృహ నిర్మాణ కార్యక్రమం నేపథ్యం

ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు సొంత ఇల్లు అందించేందుకు పీఎంఏవై పథకం ద్వారా గృహ నిర్మాణం కొనసాగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు PVTG కుటుంబాలకు కూడా సహాయం అందుతోంది. గత దశలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, ఇప్పుడు ప్రభుత్వం మరో దశలో గృహ నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు ప్రారంభించింది.

ఈ పథకం ఆర్థిక సహాయం ఎంత?

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎంత సహాయం అందుతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది . ప్రతి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.75 లక్షలు ఇస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అంత ఒకేసారి కాకుండా, ఇంటి నిర్మాణం ఎంతవరకు పూర్తయిందో పరిశీలించి దశలవారీగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.దీనివల్ల ఇంటి నిర్మాణం పద్దతిలో పూర్తవుతుంది. సాధారణంగా పునాది పూర్తయిన తర్వాత మొదటి విడత, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో విడత, పైకప్పు దశకు చేరుకున్నప్పుడు తదుపరి విడత, అలా మొత్తం అందుతుంది.

అదనపు ఆర్థిక సహాయం – ఎవరికి ఎంత?

గమనిక: అదనపు సహాయం మొత్తం, అర్హత, విడతలు వర్గం మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా మారవచ్చు.మీకు వర్తించే ప్రయోజనం, అర్హత మరియు అవసరమైన పత్రాల గురించి సమీప గ్రామ/వార్డు సచివాలయంలో అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవడం మంచిది.

ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాన పథకం 2026

లబ్ధిదారుల వర్గంఅదనపు సహాయం / వివరాలు
SCPMAY 1.0 కింద అదనపు ఆర్థిక సహాయం
STPMAY 1.0 కింద అదనపు ఆర్థిక సహాయం
BCPMAY 1.0 కింద అదనపు ఆర్థిక సహాయం
PVTGPMAY 1.0 కింద అదనపు ఆర్థిక సహాయం
ముస్లిం మైనారిటీలు18,000 మంది లబ్ధిదారులకు అదనంగా ₹50,000

నిర్మాణ పథకం ఎవరు అర్హులు?

  1. సొంత ఇల్లు పక్కా లేని కుటుంబాలు ఈ పథకానికి అర్హులు అవుతారు.
  2. మట్టి/బలహీనమైన గోడలు, కచ్చా పైకప్పులతో ఉన్న ఇళ్లలో జీవిస్తున్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు అవుతారు.
  3. సొంత భూమి లేదా స్థిరమైన ఆదాయం లేకుండా కూలి పనిపై ఆధారపడే కుటుంబాలు ఈ పథకానికి అర్హులు అవుతారు.
  4. SC, ST, BC, మైనారిటీ వర్గాల్లోని పేదలు ఆర్థికంగా వెనుకబడిన ఈ వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలు పథకానికి అర్హులు అవుతారు.
  5. వితంతువులు, దివ్యాంగులు, నిరాశ్రయులైన కుటుంబాలు సొంత నివాసం లేకుండా లేదా అత్యంత అసురక్షిత పరిస్థితుల్లో జీవిస్తున్న కుటుంబాలు పథకానికి అర్హులు అవుతారు.

లబ్ధిదారుల ఎంపిక సర్వే జాబితాల ఆధారంగా జరుగుతుంది. గ్రామ సభలో జాబితాను పరిశీలించి ఖరారు చేస్తారు. కాబట్టి మీ పేరు జాబితాలో ఉందో లేదో గ్రామ లేదా వార్డు సచివాలయంలో తప్పనిసరిగా వారిని అడిగి తెలుసుకోండి .

ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ పథకం 2026
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాన పథకం 2026

ఈ పథకానికి ఏ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి?

ఆంధ్రప్రదేశ్ ఇంటి పథకం

దరఖాస్తు సమయంలో సాధారణంగా ఇవి అడుగుతారు.

  1. ఆధార్ కార్డు (కుటుంబ సభ్యులందరివీ)
  2. తెల్ల రేషన్ కార్డు
  3. బ్యాంక్ పాస్‌బుక్ (ఆధార్‌తో అనుసంధానమైన ఖాతా)
  4. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు
  5. ఇంటి స్థలం ఉంటే దాని పట్టా లేదా పత్రాలు
  6. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ ఉండటం చాలా ముఖ్యం.బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ లేకపోతే వాయిదా సొమ్ము జమ కావడంలో ఆలస్యం జరగవచ్చు. కావున జాగ్రత్తగ అన్ని అవసరమైన డాకుమెంట్స్ ఇవ్వండి.

పథకం యొక్క లబ్ధిదారులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఇలాంటి పథకాల చుట్టూ మోసగాళ్లు కూడా తిరుగుతుంటారు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి.ప్రభుత్వ పథకం కింద మీకు అందే ప్రయోజనాల కోసం అధికారిక మార్గంలోనే సమాచారం తీసుకోవడం, ప్రతి దశను సక్రమంగా పూర్తి చేయడం మంచిది.

  • దళారులను నమ్మకండి: ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే వెంటనే వారిని దూరం పెట్టేయండి . అధికారికంగా చెల్లించాల్సిన రుసుము ఉందో లేదో సంబంధిత అధికారుల వద్ద నిర్ధారించుకోండి. దీని వళ్ళ మీకు కూడా జాగ్రత్త పడటం అలవాటు అవుతుంది.
  • అధికారిక కేంద్రాలనే సంప్రదించండి: అధికారిక సంబంధిచిన కేంద్రాలనే మాత్రమే సంప్రదించండి. పథకం అర్హత, మంజూరు, పత్రాలు, చెల్లింపులు వంటి విషయాల కోసం గ్రామ/వార్డు సచివాలయం లేదా సంబంధిత మండల కార్యాలయాన్ని సంప్రదించడం సురక్షితం.
  • నిర్మాణాన్ని ఆలస్యం చేయవద్దు: ఇల్లు మంజూరైన తర్వాత ప్రభుత్వం సూచించిన గడువులో నిర్మాణ పనులు ప్రారంభించి, నిర్ణీత దశలను సమయానికి పూర్తి చేయడం మంచిది. ఆలస్యం జరిగితే రావాల్సిన మిగతా డబ్బు అధికారిక నిబంధనల ప్రకారం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. గడువులో నిర్మాణ పనులు పూర్తిచేయాలి.
  • నిర్మాణ దశలను నమోదు చేయండి: పునాది, గోడలు, పైకప్పు వంటి నిర్మాణ దశల్లో ఫోటోలు లేదా జియో-ట్యాగింగ్ వంటి పద్దతిలో అధికారులు సూచించిన విధానంలోనే వాటిని సమర్పించాలి. ఎందుకంటే ఇది నిర్మాణ పురోగతిని నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది.
  • నిర్మాణ సామగ్రి గురించి తెలుసుకోండి: ఇసుక, సిమెంట్ లేదా ఇతర నిర్మాణ సామగ్రికి ప్రభుత్వం ఏదైనా సౌకర్యం కల్పిస్తుందా లేదా దాని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తుందా అనే విషయాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకోండి.

ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఆర్థిక స్థిరత్వం : అద్దె ఇంటి ఖర్చు తగ్గితే, ఆ మొత్తాన్ని పిల్లల చదువులకు , వైద్య ఖర్చులకు , రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి ,చిన్న చిన్న వ్యాపారానికి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. సొంత ఇల్లు ఉంటె భవిష్యత్తులో కుటుంబానికి ఒక ఆస్తిగా కూడా నిలుస్తుంది. పేదలకు కాస్త భారం తగ్గినట్టు ఉంటుంది .
  • ఉపాధి అవకాశాలు :పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగితే తాపీ మేస్త్రీలు, కూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులకు పని అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.
  • మహిళల సాధికారత : ఇంటి యాజమాన్యంలో మహిళలకు ప్రాధాన్యం లభిస్తే, కుటుంబ ఆస్తిలో వారి హక్కు బలపడుతుంది. దీనివల్ల మహిళలకు భద్రతతో పాటు కుటుంబ నిర్ణయాల్లో కూడా మరింత ప్రాధాన్యత కలిగే అవకాశం ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

3 లక్షల కొత్త ఇళ్లు

  • మీకు వర్తించే విధానం తెలుసుకోండి : గ్రామీణ ప్రాంతాల్లో PMAY-G కింద లబ్ధిదారుల గుర్తింపు సాధారణంగా ప్రభుత్వ సర్వే/జాబితా ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో PMAY-U 2.0కి సంబంధించిన దరఖాస్తు మార్గాన్ని అధికారికంగా తెలుసుకోవాలి.
  • ముందుగా జాబితా చూడండి : మీ గ్రామ/వార్డు సచివాలయం లేదా సంబంధిత పంచాయతీ కార్యాలయంలో మీ కుటుంబం లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి. ఒకవేళ పేరు లేకుంటే అడిగి విషయం తెలుసుకోండి.
  • Awaas+ Self Survey : గురించి తెలుసుకోండిఅర్హత ఉన్న గ్రామీణ కుటుంబాలకు Awaas+ వ్యవస్థ ద్వారా సర్వే అవకాశం ఉంటే, అధికారిక సూచనల ప్రకారం మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటె Self Survey ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
  • వివరాలు సరిగ్గా ఇవ్వండి : కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం, ఆస్తులు, ప్రస్తుత ఇంటి పరిస్థితి,ఈ సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాలి. ఒకవేళ తప్పు సమాచారం ఇస్తే అర్హతపై ప్రభావం పడవచ్చు.
  • పరిశీలన, జాబితా ప్రక్రియ : సర్వే పూర్తయిన తర్వాత వివరాలను ఈ పథకానికి సంబంధిచిన అధికారులు పరిశీలిస్తారు. గ్రామ సభ/అధికారిక ఎంపిక ప్రక్రియలో అర్హత నిర్ధారణ ఉంటుంది. అంత సరిగ్గా ఉంటె తదుపరి దశలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
  • ఇల్లు మంజూరైన తర్వాత నిర్మాణం ప్రారంభించండి : మంజూరు అయినా తరువాత ప్రభుత్వం సూచించిన గడువు, నిర్మాణ దశలను పాటించాలి. ఇంటికి కేంద్రం రూ.1.75 లక్షలు కేటాయిస్తోంది. నిర్మాణ పురోగతిని నమోదు చేసేందుకు అవసరమైన చోట జియో-ట్యాగ్ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది.

3D ప్రింటింగ్ హౌసింగ్ పైలెట్ ప్రాజెక్ట్

3D ప్రింటింగ్ హౌసింగ్
3D ప్రింటింగ్ హౌసింగ్

2026 october 4వ తేదీన పేదల ఇల్లుల గురించి ఒక మహా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య కర్యాకులు . ఏ కార్యాక్రమం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జరిగింది , రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమం 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్లు నిర్మించే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్యేశం.

3D కాంక్రీట్ ప్రింటింగ్ అంటే ఏమిటి?

3D కాంక్రీట్ ప్రింటింగ్ అనే పేరు వినగానే ఇది సినిమాల్లో చూసే విషయంలా అనిపించవచ్చు. కానీ ఇది చాలా సులభమైన సూత్రంపై సరికొత్త టెక్నాలజీతో పనిచేస్తుంది.3D ప్రింటింగ్‌లో ముందుగా ఇంటి డిజైన్‌ను కంప్యూటర్‌లో సిద్ధం చేస్తారు. ఆ డిజైన్ ఆధారంగా రోబోటిక్ యంత్రం ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని నాజిల్ ద్వారా పొరలుగా వేస్తూ గోడలను నిర్మిస్తుంది. ఈ పద్దతిలో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి ఇటుకను విడిగా తీసుకుని అమర్చాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఇది కేక్‌పై క్రీమ్‌తో డిజైన్ వేసినట్టుగా ఉంటుంది. గోడలు పూర్తయిన తర్వాత పైకప్పు, తలుపులు, కిటికీలు, విద్యుత్ వైరింగ్, నీటి పైపుల పనులను సాధారణ పద్ధతిలో పూర్తి చేస్తారు.3D ప్రింటింగ్ హౌసింగ్ అంటే మొత్తం ఇంటిని ఒకే యంత్రంతో పూర్తిగా తయారు చేయడం కాదు. ఇంటి నిర్మాణంలో ముఖ్యమైన గోడల నిర్మాణ దశను ఆధునిక 3D ప్రింటింగ్ టెక్నాలజీతో వేగంగా నిర్వహించే ఒక కొత్త విధానం అని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

3D కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలు

వేగం: గోడలు కట్టే నిర్మాణం తక్కువ రోజుల్లోనే పూర్తవుతుంది.
ఖచ్చితత్వం: డిజిటల్ డిజైన్ ప్రకారం కొలతలు సరిగ్గా వస్తాయి.
వృథా తగ్గడం: సిమెంట్, ఇసుక లాంటి సామగ్రి అవసరమైనంతే వాడతారు.
నాణ్యత నియంత్రణ: ఇద్దరు చేసే పని ఒక్కరు మాత్రమే చేస్తారు.ఒక్కమాటలో చెప్పాలంటే మనుషుల తప్పిదాలు తగ్గుతాయి.

Thalliki Vandanam Scheme 2026 – Eligibility, Amount & Status

1 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *