Learn • Prepare • Succeed
Government Schemes

తల్లికి వందనం పథకం 2026 – అర్హతలు, ఎంత డబ్బు – అప్లై చేసె విధానం

📅 October 6, 2026  |  Devendra Jaladurgam
తల్లికి వందనం పథకం 2026

తల్లికి వందనం పథకం 2026,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే హామీ కింద “తల్లికి వందనం” అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. “తల్లికి వందనం” పథకం ద్వారా సంవత్సరానికి 15,000 తల్లుల కాథాల్లో వేయడం జరుగుతుంది. పథకం ద్వారా పిల్లలకి వారి చదువులకు చాల ఉపయోగపడుతుంది. అయితే ఈ డబ్బు ఎవరికి వస్తుంది, ఏ షరతులు ఉన్నాయి, ఎందుకు కొందరి ఖాతాల్లో డబ్బులు పడవు అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. పథకం గురించి అన్ని వివరాలను – అర్హతలు, లబ్ధి మొత్తం, పత్రాలు, స్టేటస్ చెక్ చేసే విధానం, సాధారణ సమస్యలు – సులభంగా వివరిస్తున్నాం.

తల్లికి వందనం పథకం 2026
తల్లికి వందనం పథకం 2026

ముఖ్య సమాచారం : ఈ సమాచారం అక్టోబర్ 6, 2026 నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రకటనలు, పత్రికా కథనాల ఆధారంగా రాసినది. భవిష్యత్తో మల్లి మారె అవకాశం ఉన్నందున, చివరి నిర్ణయం కోసం మీ గ్రామ/వార్డు సచివాలయంలో కానీ పాఠశాలలో కానీ పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ధారించుకోడం మంచిది.

తల్లికి వందనం పథకం అంటే ఏమిటి?

తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన విద్యా సంక్షేమ పథకం. పిల్లలను బడికి పంపే తల్లులకు ఒకవేళ తల్లి లేనప్పుడు సంరక్షకులకు ఆర్థికంగా పిల్లలకోసం అండగా నిలవడం, ఎవరైతే డబ్బు సమస్యతో పిల్లలని బడికి పంపలేని స్థితితో ఉంటారో వారి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు . దీన్ని ముఖ్య లక్ష్యం పిల్లలని చదివించడం . ఈ సాయం ఈ సాయం నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ అవుతుంది. ఈ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులందరికీ వర్తిస్తుంది. మీ పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ,కొన్ని అర్హతలు నిబంధనలు తీరితే సాయం పొందవచ్చు.

అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పథకంలో ఏ మార్పులు చేశారు?

అమ్మ ఒడి : గతంలో అమలైన “అమ్మ ఒడి” పథకంలో ఒక కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే సాయం అందేది.

తల్లికి వందనం : తల్లికి వందనంలో అమ్మఒడిల కాదు ఇంట్లో పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు సాయం వర్తిస్తుంది. అంటే మీ ఇంట్లో ఇద్దరు చదువుతున్న అలాగే ముగ్గురు చదువుతున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.15,000 చొప్పున వారి తల్లుల ఖాతాల్లోకి పడుతుంది. ఇంట్లో చదుకునేవారు ఉంటె ఈ పథకం వారికీ చాల సాయం చేసినట్టు ఉంటుంది.

తల్లుల ఖాతాల్లోకి ఎంత డబ్బు వస్తుంది?

ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందుతుంది. కానీ తల్లుల కాథాల్లోకి మాత్రం రూ.13,000 మాత్రమే జమ అవుతుంది. మిగిలిన రూ.2,000 పాఠశాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అవసరాల కోసం కేటాయిస్తారు. కాబట్టి “మా ఖాతాలో రూ.13,000 మాత్రమే పడింది, మిగతా రూ.2,000 ఏమైంది?” అని అనుమానపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది పథకం నిర్మాణంలోనే భాగం.

కుటుంబంలో పిల్లల సంఖ్యను బట్టి లెక్క :

ఇంట్లో ఎంత మంది అర్హులు ఉంటె ఎలా లెక్కిస్తారో వివరణ చుడండి:

  • అర్హులైన పిల్లల సంఖ్య – 1 అయితే రూ.13,000 పడతాయి.
  • అర్హులైన పిల్లల సంఖ్య – 2 అయితే రూ.26,000 పడతాయి.
  • అర్హులైన పిల్లల సంఖ్య – 3 అయితే రూ.39,000 పడతాయి.
తల్లికి వందనం పథకం 2026
తల్లికి వందనం పథకం 2026

తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు?

  1. ఏపీ నివాసం: విద్యార్థి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. వేరే తెలుగు రాష్ట్రములో ఉన్న వారికీ ఈ పథకం చెల్లదు.
  2. చదువుతున్న తరగతి: 1వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు మాత్రమే ఈ పథకానికి అర్హులు.1వ తరగతి నుంచి 12వ తరగతి నుండి గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్ లేదా ప్రైవేటు పాఠశాల/కళాశాలలో చదువుతూ ఉండాలి. దీనికి కారణంగా గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు ఈ పథకం చెల్లదు .
  3. హాజరు: విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం విద్యార్థుల పాఠశాల హాజరు ఉండాలి. ఇది అత్యంత ముఖ్యమైన షరతు. తరచుగా బడికి వెళ్లకుండా ఉంటారో వారి పిల్లలకు సాయం ఆగిపోవచ్చు. రోజు బడికి వెళ్లి చదుకోవాలి .
  4. రేషన్ కార్డు: ప్రతి కుటుంబానికి చెల్లుబాటు అయ్యే రైస్ కార్డు (తెల్ల రేషన్ కార్డు) ఉండాలి. కొన్ని మార్గదర్శకాల్లో ఆదాయ పరిమితులుగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు అని అన్నారు. తాజా పరిమితులు, ఇతర మినహాయింపుల కోసం సచివాలయంలో అడిగి తెలుసుకోండి. సచివాలయం వారు మీకున్న ఆలోచనలు పరిష్కరిస్తారు.
  5. బ్యాంకు ఖాతా: తల్లి లేదా విద్యార్థి సంరక్షకుల పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.అలాగే ఆ ఖాతాకు NPCI మ్యాపింగ్ కూడా పూర్తయి ఉండాలి.ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయం ఖాతాలో జమ కావడంలో సమస్యలు రావచ్చు. ముందుగానే ఒకటికి రేడు సార్లు చూసుకోవడం మంచిది .
  6. డేటాబేస్‌లో నమోదు: పథకానికి అర్హులు అయినా కూడా కొన్ని సార్లు పొరపాటు జరవచ్చు, అందుకే మీ పాఠశాల రికార్డుల్లో, ప్రభుత్వ డేటాబేస్‌లో సరిగ్గా నమోదై ఉండాలి. ఈ విషయం గురించి మీ పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసోవడం మంచిది .

ఏ కులం, వర్గం వారు అర్హులు?

ఈ పథకం ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాదు. జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల కుటుంబాలకు అర్హత నిబంధనలు తీరితే సమానంగా వర్తిస్తుంది. అలాగే బాలురు, బాలికలు అనే తేడా లేదు.

అవసరమైన పత్రాలు

  1. తల్లి యొక్క ఆధార్ కార్డు.
  2. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే పాఠశాల గుర్తింపు వివరాలు.
  3. కుటుంబానికి చెల్లుబాటు అయ్యే రైస్ కార్డు (తెల్ల రేషన్ కార్డు).
  4. ఆధార్‌తో లింక్ చేసిన తల్లి బ్యాంకు పాస్‌బుక్.
  5. పాఠశాల హాజరు (అటెండన్స్), ప్రవేశ వివరాలు (ఇవన్నీ పాఠశాల ద్వారానే నమోదవుతాయి).
  6. ఒకవేళ తల్లి మరణించినా లేదా అందుబాటులో లేకపోయినా, సంరక్షకుల గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకం సాధారణంగా ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా అర్హులను గుర్తించి ఎవరైతే అరుహులు ఉన్నారో వారికీ అమలు చేస్తారు. కాబట్టి ప్రతి కుటుంబం అప్లికేషన్ నింపాల్సిన పరిస్థితి ఉండదు . ఇప్పుడంతా డిజిటల్ గా అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారు .అందువలన కావలిసిన పత్రాలను తీసుకొని వెళ్తే సరిపోతుంది .అయినా మీ వివరాలు జాబితాలో ఉన్నాయో లేదో కింది పద్ధతిలో తెలుసుకోండి:

తల్లికి వందనం పథకం 2026

  1. మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే మీ గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్లి మీ ఆధార్ లేదా రేషన్ కార్డు నంబర్ ఇచ్చి, వారిని ఎలా అడగండి “తల్లికి వందనం పథకానికి మేము అర్హులము అయ్యామా లేదా”.ఇలా అడగడం వల్ల డేటాబేస్ లో ఎలిజిబిలిటీ చెక్ చేసి మీకు తెలియజేస్తారు.
  2. చెక్ చేసిన తరువాత జాబితాలో మీ పేరు లేకపోతే,వారి అడిగి కారణం తెలుసుకుని, అవసరమైన మార్పులు చేయడానికి ప్రయత్నించండి. ముక్యంగా మార్పులు ఎక్కడ అవుతాయి అంటే ఆధార్ అప్డేట్ , రేషన్ కార్డు సవరణ, పాఠశాల రికార్డు సరిదిద్దడం ఇలాంటి ఏక్కువగా జరుగుతాయి,వీలైనంత త్వరగా మార్పులు చేయడం మంచిది.
  3. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని కలిసి మీ పిల్లల హాజరు, ప్రవేశ వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోండి. ఇది తెలుసుకోవడం వలన పథకానికి అరుహుల కదా అని అర్థమవుతుంది.
  4. బ్యాంకుకు వెళ్లి మీ ఖాతా ఆధార్‌తో లింక్ అయివుందో చుడండి , NPCI మ్యాపింగ్ అడగండి.బ్యాంకుకు సంబందిచిన ఈ రెండు లింక్ అయితేనే ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. లింక్ చేయకుంటే ఖాతాల్లోకి డబ్బులు పడవు .

తల్లి లేకపోతే ఎవరికి వస్తుంది?

తల్లి మరణించినా లేదా అందుబాటులో లేకపోయినా, చట్టబద్ధమైన సంరక్షకుల ఖాతాకు సాయం అందే ఏర్పాటు ఉంటుందని నేరుగా పథకం వివరాల్లో పేర్కొన్నారు. దీని వల్ల ప్రతి యొక్క అర్హులైన విద్యార్థులకు న్యాయంగా అందరికి డబ్బులు అందుతాయి.

స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

గ్రామ/వార్డు సచివాలయం: మీ ఆధార్ లేదా రేషన్ కార్డు నంబర్ ఇచ్చి సహాయకులను అడగండి.

NBM (నవశకం లబ్ధిదారుల నిర్వహణ) పోర్టల్: ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాల స్టేటస్ చూడవచ్చు. ఈ పోర్టల్ చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటె సరిపోతుంది .

బ్యాంకు ఖాతా: మొబైల్ బ్యాంకింగ్ లేదా పాస్‌బుక్ ఎంట్రీ ద్వారా DBT జమ అయ్యిందో చూసుకోండి. “DBT”, “AP GOVT” వంటి వివరాలతో క్రెడిట్ చూపుతుంది. జమ అయ్యినతరువాత మీ ఫోన్లో మెస్సేజ్ వస్తుంది.

హెల్ప్‌లైన్ 1902: పథకాల ద్వారా ఏమైనా ఇబ్బందులు ఎదురయినా ,ఏమైనా సందేహాలు ఉన్న , ఫిర్యాదుల కోసం ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది .

ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు :

  1. పేద కుటుంబాలకు పుస్తకాలు, యూనిఫాం, రవాణా వంటి ఖర్చులకు ఆర్థిక ఆసరా లభిస్తుంది.
  2. పిల్లలు క్రమం తప్పకుండా బడికి వెళ్లేలా హాజరు షరతు ప్రోత్సహిస్తుంది.
  3. డబ్బు తల్లి ఖాతాలోకి వెళ్లడం వల్ల కుటుంబ నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరుగుతుంది.
  4. ప్రతి బిడ్డకూ సాయం కావడంతో పెద్ద కుటుంబాలకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) :

1. తల్లికి వందనం పథకంలో ఎంత డబ్బు వస్తుంది?
ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000. ఇందులో రూ.13,000 తల్లి ఖాతాలో జమ అవుతుంది, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు.

2.ప్రైవేటు స్కూల్ పిల్లలకు వస్తుందా?
అవును, అర్హత నిబంధనలు తీరితే వస్తుంది.

3.డబ్బు రాకపోతే ఏం చేయాలి?
ముందుగా ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్, రేషన్ కార్డు, పాఠశాల హాజరు వివరాలను సరిచూసుకోండి. తర్వాత గ్రామ/వార్డు సచివాలయంలో, లేదా 1902 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయండి.

ముగింపు

తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కుటుంబాలకు నేరుగా ఆర్థిక ఊరటను ఇస్తున్న పథకం. ప్రతి బిడ్డకూ రూ.15,000 సాయం అందడం పెద్ద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *