Learn • Prepare • Succeed
National Current Affairs

ప్రధాని నరేంద్ర మోదీ -1 : ప్రజా సంక్షేమానికి సైన్స్ శక్తి తోడైనప్పుడే నిజమైన పురోగతి

📅 October 28, 2026  |  Devendra Jaladurgam
ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ,న్యూఢిల్లీలో 2026 అక్టోబర్ 27న ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ (ESTIC) అనే వేదిక నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినికి ముఖ్య అతిధులు మోడీగారు.వేదిక మీద శాస్త్రీయ పరిశోధనల గురించి కొన్ని సందేశాలు ఇచ్చారు. పరిశోధనలు ప్రయోగాలు గోడల మధ్యే ఉండిపోకుండా అది సామాన్యుల బతుకులకు కూడా ఉపయోగపడాలని ఆయన అన్నారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయికి దూసుకెళ్తున్న భారత్

నరేంద్ర మోడీగారు మాట్లాడుతూ ,21వ శతాబ్దంలో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అంటే గతంలో భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు మాత్రం రోజులు గడుస్తూన్న కొద్దీ, భారతదేశంలో కొత్త సాకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ, ఎన్నో విజయాలను అందుకుంటుంది.
ఉదాహరణకు :
చంద్రుడిపై పరిశోధనలు చేయడం.
చంద్రయాన్ గురించి పరిశోధనలు చేయడం.
అతి బయంకరమైన కరోనా వైరస్ టీకాలను భారత్‌లోనే తయారు చేయడం.

ప్రధాని నరేంద్ర మోదీ

పరిశోధనలకు సంబంధించి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) నుంచి ఆర్థిక సహకారం

భారత్‌దేశంలో కొత్త విషయాలను కనుగొనే పరిశోధనలు, శాస్త్రీయ నూతన ఆవిష్కరణలు ఎక్కువగా జరగాలని ప్రధాని మోడీగారు ఆ సభలో అన్నారు. కాబట్టి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) ద్వారా పరిశోధనలకు ప్రోత్సాహం అందించాలి అని పేర్కొన్నారు.

పేటెంట్ల నమోదులో భారత్‌ దూసుకుపోతుంది

నరేంద్ర మోడీగారు మాట్లాడుతూ,పేటెంట్ అంటే ఒక శాస్త్రవేత్త కొత్త రకం యంత్రాన్ని తయారు చేస్తే, దానికి పేటెంట్ పొందవచ్చు. ఆ యంత్రానికి అన్ని బాధ్యతలు నీకు వస్తాయి. భారత్‌లో సరికొత్త విజయం,అదేంటంటే ఆవిష్కరణలకు సంబంధించి పేటెంట్ల పెరుగుదల 50,000 నుంచి 1.5 లక్షలకు పెరిగింది, ఈ విషయం ప్రధాని మోడీగారు తెలిపారు.పేటెంట్ల సంఖ్య పెరిగినంత మాత్రాన పరిశోధనలు,కొత్త ఆవిష్కరణతో భరత్ డెవలప్ అయింది అని అనుకోవద్దు.పేటెంట్ల సంఖ్య పెరగడం మాత్రమే ముఖ్యం కాదు,కొత్త వస్తువులను తయారు చేయడం, పరిశోధనలు చేయడం వంటివి కూడ ప్రజలు చేయాలి .

ప్రపంచ పురోగతిలో AI సాంకేతికత కీలక పాత్ర కానీ

నరేంద్ర మోడీగారు మాట్లాడుతూ , AI మన పనులను ఒకరకంగా సులభం చేస్తుంది. కానీ పూర్తిగా దాని మీద ఆధారపడితే మనం చాలావరకు మన సొంత ఆలోచనా శక్తిని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మర్చిపోతాం.అని అన్నారు. కాబట్టి శాస్త్రవేత్తలు ప్రతి పనికీ AI మీదే ఆధారపడకూడదని ప్రధాని సూచించారు.

ఉదాహరణ:
1 .కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తే చాల వరకు పరిశోధనకు సంబంధించి పనులు తొందరగా అవుతాయి.
2 .అదే మనిషి పని చేస్తే తన సొంతంగా నిర్ణయాలు తీసుకొని కాస్త నిదానంగా అయినా కొత్తగా ఆవిష్కరిస్తారు.

ప్రధాని నరేంద్ర మోదీ

అణుశక్తి అభివృద్ధిలో భారత్‌ సరికొత్త ముందడుగు

భారతదేశ అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) అనే ఒక రియాక్టర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR)తో సుమారుగా 500 మెగావాట్లు ఉత్పత్తి చేయవచ్చు. చరిత్రలోనే తొలిసారిగా అణు రియాక్టర్‌లో స్థిరమైన, నిరంతర అణు చర్యను ప్రారంభించడం. అణుశక్తి రంగంలో ముఖ్యమైన విజయంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

APPSC పరీక్షల కోసం కరెంట్ అఫైర్స్ 2026

Q1 ESTIC పూర్తి పేరు ఏంటి ?దాని వివరణ ఏమిటి?

సమాదానం: ఇది ఒక కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన సదస్సు.ESTIC – Emerging Science, Technology and Innovation Conclave.

Q2 ANRF పూర్తి పేరు? వివరణ ?

సమాదానం: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF).పరిశోధనలకు వారికీ అవసరమైన డబ్బు, సహాయ సహకారాలు అందించి, భారత్‌లో కొత్త ఆవిష్కరణలు పెరిగేలా చేయడం.ఇది కేవలం సహాయం అందించే ఫౌండేషన్.

Q3 PFBR పూర్తి పేరు? వివరణ ?

సమాదానం: మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR).దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 500 మెగావాట్లు.అణుశక్తి సహాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ కరెంటు అఫైర్స్ గ్రూప్ 1,2,3,4.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *