ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026: ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు (1–20 అక్టోబర్ 2026)
ముఖ్యమైన నోట్స్ : ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్. ఈ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు మరియు వాటి వివరణలు మీకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడ్డాయి. మీరందరూ బాగా చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని మేము కోరుకుంటున్నాము.
ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026
Q1 ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమాలకు పాల్పడే రవాణాను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రకటనను ఆమోదించిన సంస్థ ఏది?
సమాదానం:
Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC).
వివరణ:
2026 అక్టోబర్ 13న భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన తొలి BIMSTEC హోం మంత్రుల సమావేశం జరిగింది.అ సమావేశం లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మర్యాదగల దేశాలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.ముక్యంగా మూడు విషయాల గురించి చర్చించారు.అందులో భాగంగా మొదటగా ఉగ్రవాదానికి డబ్బు అందకుండా చూడటం,రెండవది కొత్త వ్యక్తులను ఉగ్రవాద సంస్థల విషయాల్లో వారిని చేర్చుకోకుండా ఆపేయడం,మూడవది ఇంటర్నెట్, కొత్త టెక్నాలజీ ఉగ్రవాదులు వారి పనుల కోసం ఉపయోగించకుండా ముందస్తు జాగ్రత్త పడటం.
Q2 2026 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది?
సమాదానం:
నవనేతం “నవి” పిళ్లే (Navanethem Pillay).
వివరణ:
2026 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మహిళ నవి పిళ్లే. ఈమె దక్షిణాఫ్రికాకు సంబంధిచిన న్యాయవాది. ఆమె ప్రజల గురించి హక్కులను కాపాడటం, అన్యాయం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి పనులు చేయడానికి కృషి చేశారు. ఈ కృషికి గుర్తింపుగా ఆమెకు నోబెల్ శాంతి అనే బహుమతి లభించింది.
Q3 నల్ల సముద్రంలో డ్రోన్ దాడికి గురైన MV ABLE నౌకలో ఎంతమంది భారతీయులు ఉన్నటు తెలిసింది?
సమాదానం:
మొత్తం 7 మంది.
వివరణ:
2026 అక్టోబర్లో నల్ల సముద్ర అనే ప్రాంతంలో ఒక నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆ నౌకలో భారతీయ కూడా ఉన్నారు.మొత్తముగా రెండు నౌకలు ఉండగా, MV ABLE నౌకలో 7 మంది భారతీయులు, Aframax Rio నౌకలో 23 మంది భారతీయులు ఉన్నట్లు చెప్పారు.ఇందులో నౌక పేరు బట్టి భారతీయ సంఖ్య మారుతుంది.
Q4 ఆహారాన్ని ఇతర దేశాలపై ఆర్థిక ఒత్తిడి తెచ్చే సాధనంగా ఉపయోగించకూడదని ఏ కూటమి అంగీకరించింది?
సమాదానం:
G20 వాణిజ్య మంత్రుల సమావేశం
వివరణ:
ఆహారాన్ని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగించకూడదని G20 సమావేశంలో చర్చిండం జరిగింది .
Q5 కృత్రిమ మేధస్సు AI ఉపయోగించడం ద్వారా యుద్ధంలో దాడి లక్ష్యాలను నిర్ణయించడం వల్ల ఏ ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది?
సమాదానం:
సైనిక నిర్ణయాల్లో మానవుల పాత్ర తగ్గిపోవడం.
వివరణ:
2026 అక్టోబర్ 20న వెలువడిన UN వార్తల్లో ప్రకారంగా చూస్తే, యుద్దానికి AI వినియోగం పెరుగుతుండటంతో మనుషుల నిర్ణయాలు తగ్గే ప్రమాదం ఉంటుందని హెచ్చరిక చేసింది.

Q6 లక్షలాది మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు UN తెలిపిన దేశం ఏది?
సమాదానం:
ఆఫ్ఘనిస్తాన్.
వివరణ:
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో చాల వరకు ఆహారం ఉన్నప్పటికీ, చాలా కుటుంబాల దగ్గర డబ్బులు లేక చాల అవస్థలు పడుతున్నారు.రూపాయి ఉండే వస్తువు 10 రూపాయలు పడుతుంది. చేసేదేమిలేక అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇదే ఆ దేశంలో ఆహార సంక్షోభానికి ఒక ముఖ్యమైన కారణం.
Q7 2026 అక్టోబర్ 20న UN నివేదిక ప్రకారం భారీగా ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లిన దేశం ఏది?
సమాదానం:
యెమెన్.
వివరణ:
యెమెన్లో 2026 సెప్టెంబర్ మొదట్లో హౌతీ యోధులు, అలాగే యెమెన్ ప్రభుత్వ దళాల మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమయ్యింది. యెమెన్లో మళ్లీ యుద్ధం మొదలవడంతో చాలా మంది ప్రజలు వాళ్ళ ఇళ్లను వదిలి మరోచోటుకి వెళ్లాల్సి వచ్చింది. తైజ్ ప్రాంతంలో మాత్రం యుద్ధం తీవ్రం కావడంతో అక్కడున్న బాధితులకు ఆహారం, నీరు, మందులు అవసరమైన వస్తువులు వంటివి అందించడం కష్టంగా మారింది.
Q8 సూడాన్ యుద్ధం ప్రభావం సరిహద్దులు దాటి వ్యాపించడంతో ఏ దేశం అప్రమత్తమైంది?
సమాదానం:
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ (Central African Republic)
వివరణ:
సూడాన్ దేశంలో యుద్ధం వల్ల బారి నష్టం కారణంగా పక్కనే ఉన్న మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో కూడా భద్రత సమస్యలు ఎదురయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ దాడులు జరగడం వళ్ళ, ప్రజలు వాళ్ళ ఇళ్లను వదిలి పెట్టడం వంటి సమస్యలపై ఐక్యరాజ్యసమితి 2026 అక్టోబర్ 20న ఆందోళన వ్యక్తం చేసింది.
Q9 2026 అక్టోబర్లో ప్రపంచ దేశాలు ప్రకృతి పరిరక్షణపై మాట్లాడటానికి ఏ నగరంలో సమావేశమయ్యాయి?
సమాదానం:
నగరం-యెరెవాన్
,దేశం-ఆర్మేనియా
వివరణ:
2026 అక్టోబర్ 19న ఆర్మేనియా అనే దేశంలో యెరెవాన్ ఒక నగరం.అయితే దీనికి సంబంధించి జీవవైవిధ్య పరిరక్షణపై అంతర్జాతీయ చర్చలు జరిగాయి. జీవవైవిధ్య పరిరక్షణపై సమావేశంలో మొక్కలు, జంతువులు , అడవులు, ప్రకృతిని ఎలా కాపాడాలి అనే విషయాలపై మిగతా దేశాల పెద్దలు చర్చిండం జరిగింది.
Q10 శీతాకాలంలో ప్రజలకు వైద్య సేవలు, మరియు ఇతర సహాయాలు అవసరమవుతాయని WHO ఆందోళన వ్యక్తం చేసిన దేశం ఏది?
సమాదానం:
ఉక్రెయిన్.
వివరణ:
WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ సంస్థ ప్రకారం, యుద్ధం వల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కోవలిసి వస్తుందని పేర్కొనింది. దానిలో భాగంగా విద్యుత్, వేడి, నీరు,అవసరమైన శీతాకాల సదుపాయాలను మరియు ఆరోగ్య సేవలకు ముందస్తు సహాయం ఇవన్నీ చాల అవసరం.యుద్ధ సమయంలో ఇవన్నీ అందించడం ముఖ్యమైన అంశం.

ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026:
Q11 మూడు ఆగ్నేయాసియా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు జరిగిన వార్షిక సమావేశం ఏది?
సమాదానం:
ASEAN (Association of Southeast Asian Nations.).
వివరణ:
వియత్నాం–లావోస్–కంబోడియా దేశాల రక్షణ మంత్రులు కలిసి మూడు పక్షాల వార్షిక సమావేశం జరిగింది.ASEAN అనేది ఆగ్నేయాసియాలోని దేశాల సమాఖ్య అని అర్థం.ఈ మూడు దేశాలు కలిసి తమ దేశాలలో ఉన్న ప్రాంతాలకు శాంతి, భద్రతను కాపాడుకోవడానికి, అలాగే రక్షణ పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి, ముఖ్యమైన సమస్యలపై చర్చించుకోవడానికి ASEAN అనేది ఒక వేదికగా పనిచేస్తుంది.
Q12 యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 2026లో ఏ ప్రాంతంలో పర్యటించారు?
సమాదానం:
పశ్చిమ బాల్కన్ ప్రాంతం.
వివరణ:
2026 అక్టోబర్ ప్రారంభంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పశ్చిమ బాల్కన్ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో పర్యటించారు.ఆమె పర్యటించిన దేశాల పేర్లు అల్బేనియా, కొసోవో, మాంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా.ఈ పర్యటన ఆమె ఎందుకు చేసారంటే ముఖ్యంగా ఆయా దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ మధ్య బంధాన్ని పెంపొందించుకోవడానికి చేసింది.
Q13 “Layers of Security” అనే ఇతివృత్తంతో జరిగిన 2026 భద్రతా వేదిక ఏ నగరంలో జరిగింది?
సమాదానం:
హెల్సింకి, ఫిన్లాండ్.
వివరణ:
2026 అక్టోబర్ 2 నుంచి 4 వరకు ఫిన్లాండ్ రాజధాని అయిన హెల్సింకిలో భద్రతకు సంబంధించి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూరప్ భద్రతను ఎలా పెంపొందించాలి,దేశాలు కలిసి ఎలా పనిచేయాలి,దేశాల మధ్య ఎంత జాగ్రత్త వహించాలి అనే అంశాలపై చర్చించారు.
Q14 2026 అక్టోబర్ 20న అంతర్జాతీయ వార్తల్లో ప్రస్తావించబడిన యుద్ధ సంబంధిత అంశం ఏది?
సమాదానం:
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం.
వివరణ:
ముక్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. దానిలో భాగంగా ఉక్రెయిన్లో ఉన్న విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థల ప్రాంతాలపై దాడులు చేసినట్లు, అలాగే రవాణా మౌలిక సదుపాయాలపై దాడులు చేసినట్లు వార్తల్లో నిలిచాయి.ఈ దాడి వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విద్యుత్ నిలిపివేయడం జరిగింది.
Q15 గ్లోబల్ వార్మింగ్ వల్ల అడవులు, పగడపు దిబ్బలు వంటి సహజ వ్యవస్థలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడుతోంది? అవి మొత్తం ఎన్ని ?
సమాదానం:
మొత్తం మూడు వ్యవస్థలు- పగడపు దిబ్బలు, అమెజాన్ వర్షారణ్యాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు.
వివరణ:
గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కడం, జంతువులు సంఖ్య తగ్గడం మరియు మొక్కల సంఖ్య తగ్గడం.దీనివల్ల ముక్యంగా ప్రకృతికి ప్రమాదం ఏర్పడుతోంది. సముద్రాల్లోని పగడపు దిబ్బలు వేడికి దెబ్బతింటాయి. అమెజాన్ అడవులు కరువు చూస్తాయి. దీంతో అనేక జంతువులు, మొక్కలు తమ నివాసాలను కోల్పోతున్నాయి.
జాగ్రత్త వహించాల్సిన విషయం :
ఏ కరెంటు అఫైర్స్ ముఖ్యంగా APPSC గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్, SI పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ముక్యంగా జాగ్రత్త వహించాల్సిన విషయాలు
1 . ముందుగా రోజు మీరు కరెంటు అఫైర్స్ కోసం ఒక నోట్స్ పెట్టుకోవాలి.దీని వళ్ళ మీరు మల్లి చదివేటప్పుడు చాల సులభంగా అనిపిస్తుంది.
2 . కచ్చితంగా రోజు టాపిక్స్ పరంగా కరెంటు అఫైర్స్ చదవాలి.
3 . చదవటానికి కనీసం రెండు గంటల సమయం కేటాయించాలి.
